Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి సమంత ఒకరు. అయితే ఇటీవల కాలంలో ఈమె తన వ్యక్తిగత విషయాల వల్ల ఇండస్ట్రీకి ఏడాది పాటు విరామం ఇచ్చారు. త్వరలోనే తిరిగి తన సినిమాలు వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
సమంత చివరిగా సిటాడేల్ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. దీనిని హనీ బన్నీ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సిరీస్ నవంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తే కనుక సమంత భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలలో నటించారని స్పష్టంగా తెలుస్తోంది.
ఇలా ఈ సిరీస్ కోసం సమంత పడిన కష్టానికి తగ్గ స్థాయిలోని రెమ్యూనరేషన్ కూడా అందుకున్నారని తెలుస్తుంది. సాధారణంగా ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకునే సమంత ఈ సిరీస్ కోసం ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం.
10 కోట్ల రూపాయలు..
ఇలా ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఏ హీరోయిన్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోలేదు. ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్న మొట్టమొదటి సౌత్ నటిగా సమంత గుర్తింపు పొందారు. అయితే నయనతార ఇటీవల నటించిన జవాన్ సినిమాకు ఎనిమిది నుంచి పది కోట్ల వరకు తీసుకున్నారు కానీ వెబ్ సిరీస్ కోసం పది కోట్ల రూపాయలు తీసుకున్న నటిగా సమంత గుర్తింపు పొందారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…