Sridevi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి శ్రీదేవి ఒకరు. ఈమె భాషతో సంబంధం లేకుండా అన్ని భాషా చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె అనుకోకుండా మృత్యువాత పడిన సంగతి మనకు తెలిసిందే.
ఇకపోతే శ్రీదేవి తెలుగు చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున చిరంజీవి వంటి స్టార్ హీరోలు అందరి సరసన నటించారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ నుంచి మొదలుకొని తరువాత తరం హీరోలతో కూడా ఈమె నటించి మెప్పించారు. అయితే అప్పటికే స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న శ్రీదేవి సినిమాల విషయంలో కాస్త పొగరుగానే ప్రవర్తించేదని హీరోలకు కాకుండా హీరోల కంటే తన పాత్ర ప్రాధాన్యత ఉండాలని మొండిపట్టు పట్టేదని తెలుస్తోంది.
ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు చిరంజీవి విషయంలో ఈమె చాలా పొగరుగా ప్రవర్తిస్తూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నారని తెలుస్తోంది. ముందుగా వీరిద్దరి కాంబినేషన్లో కొండవీటి దొంగ అనే సినిమా రావాల్సి ఉండేదట ఈ సినిమా కథ విన్నటువంటి శ్రీదేవి కొండవీటి దొంగ అని కాకుండా రాణి అని పెట్టాలని డిమాండ్ చేశారట.
ఇలా ఈమె డిమాండ్ చేయడంతో డైరెక్టర్ ఏ సినిమాలో అయినా హీరో పాత్రని డామినేషన్ గా ఉంటుందని చెప్పి ఈమెను తొలగించి ఈమె స్థానంలో రాదను తీసుకున్నారు. ఇక ఈ సినిమా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వజ్రాల దొంగ అనే సినిమా కూడా క్యాన్సిల్ అయింది ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా విషయంలో కూడా ఈమె కాస్త మొండి పట్టు పట్టారని తెలుస్తుంది.
తన పాత్రకు ప్రాధాన్యత..
నిజానికి ఈ సినిమాకు జగదేకవీరుడు అని మాత్రమే టైటిల్ ఖరారు చేశారట. కానీ తనకు ప్రాధాన్యత ఉండాలన్న ఉద్దేశంతో శ్రీదేవి పట్టుబట్టి మరి అతిలోక సుందరి అనే టైటిల్ కూడా పెట్టించారని తెలుస్తోంది అలా తప్పనిసరి పరిస్థితులలో ఈ టైటిల్ తో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో మోసగాడు ఎస్పీ పరశురాం వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…