Vennela Kishore : సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు అంటే ఒకప్పుడు బ్రహ్మానందం అలీ వంటి వారు మాత్రమే గుర్తుకు వచ్చేవారు. అయితే ఇటీవల కాలంలో కమెడియన్స్ గా ఎంతో మంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అలాంటి వారిలో కమెడియన్ వెన్నెల కిషోర్ ఒకరు. ఈయన వెన్నెల అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకొని ఆ సినిమా పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.
ఇలా కమెడియన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంత మంచి సక్సెస్ అందుకున్న ఈయన ఇటీవల హీరోగా కూడా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్న వెన్నెల కిషోర్ సినిమాలలోకి రాకముందు ఏం చేసేవారనే విషయం చాలామందికి తెలియదు. మరి ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు ఎలాంటి ఉద్యోగం చేసే వారు ఎక్కడ ఉండేవారు అనే విషయానికి వస్తే…
తెలంగాణలోని కామారెడ్డిలో పుట్టి పెరిగిన కిషోర్.. పదో తరగతి దాకా సొంతూరులోనే చదువుకున్నాడు. హైదరాబాదులో ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేసిన ఈయన ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. మిచిగాన్‌లోని ఫెర్రిస్ స్టేట్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి.. వర్జీనియాలోని థామ్సన్ ఫైనాన్స్ సంస్థలో సాఫ్ట్‌వేర్ టెస్టర్ గా ఉద్యోగం సంపాదించాడు. ఇలా అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ మరో సాఫ్ట్వేర్ అమ్మాయిని వివాహం చేసుకున్న ఈయన తన లైఫ్ ఎంతో లగ్జరీగా గడుపుతూ ఉండేవారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్..
ఇలాంటి సమయంలోనే డైరెక్టర్ దేవ కట్టా వెన్నెల అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా 90% మిచిగాన్ లోనే జరిగింది అయితే ఈ సినిమాలో ఖాదర్ పాత్రలో నటించాల్సిన శివా రెడ్డికి వీసా సమస్య తలెత్తడంతో ఆ పాత్రలో వెన్నెల కిషోర్ నటించారు. ఇలా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిషోర్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ కావడంతో ఈయనకు తదుపరి సినిమా అవకాశాలు వచ్చాయి .అయితే మూడు సంవత్సరాల వరకు ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు. మూడేళ్ల తర్వాత తిరిగి ఇండియా వచ్చిన ఈయనకు అవకాశాలు రావడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన పూర్తిగా ఇండస్ట్రీలోనే స్థిరపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…