Categories: FeaturedMovie News

Double Ismart : లైగర్ ఎఫెక్ట్..! ఇబ్బందులలో పడిన పూరి జగన్నాథ్ డబల్ ఇస్మార్ట్… లైన్ క్లియర్ అయ్యేనా?

Double Ismart : పూరి జగన్నాథ్ ఇటీవల కాలంలో చేసే సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఈయన విజయ్ దేవరకొండతో నటించిన పాన్ ఇండియా చిత్రం లైగర్ ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఫలితాలను ఇవ్వకపోవడం కాకుండా ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లు సైతం భారీ స్థాయిలో నష్టపోయారు.

ఈ సినిమా తీవ్రమైన నష్టాలను తీసుకురావడంతో అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు కూడా పెద్ద ఎత్తున రచ్చ చేశారు. అయితే ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ రామ్ పోతినేనితో డబల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు కూడా కాస్త ఇబ్బందులు వచ్చాయని తెలుస్తుంది. లైగర్ సినిమా అప్పులను ప్రముఖ నిర్మాత.. డిస్ట్రిబ్యూటర్ ఏసియన్ సునీల్ తీరుస్తారని దానికి బదులుగా పూరి జగన్నాథ్ ఆయనకు ఓ సినిమా చేయడానికి మధ్య అంగీకారం కుదిరిందంటూ వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ వార్తలపై తాజాగా ఏషియన్ సునీల్ స్పందించారు నేను లైగర్ సినిమా అప్పులు తీరుస్తానంటూ వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. పూరి జగన్నాథ్ సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమే కానీ సినిమా చేయాలి అనుకుంటే డైరెక్ట్గా చేస్తానే తప్ప ఇలా చేయనని వెల్లడించారు.

రంగంలోకి స్రవంతి రవి కిషోర్..
గతంలో ఛాంబర్లో లైగ‌ర్ కారణంగా నైజాంలో.. విశాఖలో తలెత్తిన థియేటర్ల సమస్య గురించి కూడా సమావేశాలు మొదలైనట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం రామ్ బంధువు నిర్మాత స్రవంతి రవి కిషోర్ రంగంలోకి దిగారు. పూరి – ఛార్మి తరపున ఆయన ఛాంబర్ లో వ‌క‌ల్తా పుచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుస్తోంది ఏది ఏమైనా లైగర్ సినిమా ఎఫెక్ట్ రా సినిమాపై భారీగా చూపించబోతుందని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago