Double Ismart : పూరి జగన్నాథ్ ఇటీవల కాలంలో చేసే సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఈయన విజయ్ దేవరకొండతో నటించిన పాన్ ఇండియా చిత్రం లైగర్ ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఫలితాలను ఇవ్వకపోవడం కాకుండా ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లు సైతం భారీ స్థాయిలో నష్టపోయారు.

ఈ సినిమా తీవ్రమైన నష్టాలను తీసుకురావడంతో అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు కూడా పెద్ద ఎత్తున రచ్చ చేశారు. అయితే ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ రామ్ పోతినేనితో డబల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు కూడా కాస్త ఇబ్బందులు వచ్చాయని తెలుస్తుంది. లైగర్ సినిమా అప్పులను ప్రముఖ నిర్మాత.. డిస్ట్రిబ్యూటర్ ఏసియన్ సునీల్ తీరుస్తారని దానికి బదులుగా పూరి జగన్నాథ్ ఆయనకు ఓ సినిమా చేయడానికి మధ్య అంగీకారం కుదిరిందంటూ వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ వార్తలపై తాజాగా ఏషియన్ సునీల్ స్పందించారు నేను లైగర్ సినిమా అప్పులు తీరుస్తానంటూ వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. పూరి జగన్నాథ్ సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమే కానీ సినిమా చేయాలి అనుకుంటే డైరెక్ట్గా చేస్తానే తప్ప ఇలా చేయనని వెల్లడించారు.
రంగంలోకి స్రవంతి రవి కిషోర్..
గతంలో ఛాంబర్లో లైగర్ కారణంగా నైజాంలో.. విశాఖలో తలెత్తిన థియేటర్ల సమస్య గురించి కూడా సమావేశాలు మొదలైనట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం రామ్ బంధువు నిర్మాత స్రవంతి రవి కిషోర్ రంగంలోకి దిగారు. పూరి – ఛార్మి తరపున ఆయన ఛాంబర్ లో వకల్తా పుచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుస్తోంది ఏది ఏమైనా లైగర్ సినిమా ఎఫెక్ట్ రా సినిమాపై భారీగా చూపించబోతుందని తెలుస్తోంది.



























