Samantha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతూ ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు నటి సమంత. ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్ లతోపాటు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలానటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.
నాగచైతన్యతో ప్రేమలో ఉన్నటువంటి ఈమె పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా పెళ్లయిన కొంతకాలానికి తన భర్తతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్న తర్వాత ఎంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సమంత ఆ బాధ నుంచి బయటపడి తిరిగి సినిమా పనులలో బిజీ అయ్యారు. అయితే ఆ తర్వాత ఈమె మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడ్డారు.
ఈ వ్యాధి కారణంగా దాదాపు నాలుగైదు నెలలు ఇంటికే పరిమితమయ్యారు. ఇలా ఈ వ్యాధి నుంచి కోలుకున్నటువంటి ఈమె తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ కనుక చూస్తే ఈమె తిరిగి మరి ప్రేమలో పడ్డారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అయితే గత కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తితో కలిసి ఈమె దిగిన ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.
చిలి దేశానికి చెందిన ప్రముఖ రచయిత రాసినటువంటి ఒక కొటేషన్ ను సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు… ఇందులో భాగంగా ఈమె చావు నుండి మనల్ని ఏది కాపాడలేనప్పుడు ప్రేమతో జీవితాన్ని కాపాడుకోవడమే అంటూ ఓ కొటేషన్ షేర్ చేశారు. దీంతో సమంత తిరిగి ప్రేమలో పడిందా అందుకే ఇలాంటి కొటేషన్స్ షేర్ చేస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…