Kirak RP: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఆర్పి అనంతరం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు ఇలా ఈ కార్యక్రమానికి దూరమైనటువంటి ఈయన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు ఇలా హైదరాబాదులో పలు ప్రాంతాలలో ఈయన ఓన్ బ్రాంచెస్ ఓపెన్ చేశారు.
ఇక హైదరాబాద్ బెంగళూరు విజయవాడ వంటి ప్రాంతాలలో ప్రాంచైజీస్ ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఇలా తన రెస్టారెంట్ బిజినెస్ ఎంతో సక్సెస్ఫుల్ కావడంతో కొందరు ఓర్చుకోలేక తన రెస్టారెంట్ బిజినెస్ పై దెబ్బ కొట్టాలని ఉద్దేశపూర్వకంగానే చేపల పులుసు రుచి బాగాలేదు అంటూ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై ఆర్పి స్పందించారు.
ఈ సందర్భంగా ఆర్పీ మాట్లాడుతూ… పెయిడ్ బ్యాచ్ నన్ను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసి నా చేపల పులుసు బిజినెస్ ను దెబ్బతీయాలని ఉద్దేశపూర్వకంగా చేపల పులుసు రుచి బాగాలేదని ప్రచారం చేస్తున్నారు అయితే ఇలా ప్రచారం చేసిన నాకు వచ్చే నష్టం ఏమీ లేదని ఈయన తెలిపారు ఎందుకంటే నేను హై క్వాలిటీ పులుసును అందిస్తున్నాను కనుక నాకు ఎలాంటి భయం లేదని తెలిపారు.
నేను తయారు చేసే చేపల పులుసు కోసం నెల్లూరు నుంచి చేపలు తెప్పిస్తానని తెలిపారు.క్వాలిటీ విషయంలో తాను ఏ మాత్రం రాజీపడలేదు కనుక నా బిజినెస్ కి ఎలాంటి ఢోకా లేదని ఇలాంటి నెగటివ్ ప్రచారం చేసిన నాకు వచ్చే నష్టమేమీ లేదని తెలిపారు. ఒకవేళ రుచి బాగా లేకపోతే ఎంతోమంది స్టార్స్ చేపల పులుసు తీసుకోవడానికి ఇక్కడికి రారు.ఈ చేపల పులుసుకు చాలా డిమాండ్ ఉంది కొన్నిసార్లు అనుకున్న స్థాయిలో తానే సప్లై చేయలేకపోతున్నాను అంటూ ఈ సందర్భంగా అర్పి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…