Sitara Ghattamaneni : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన మరోవైపు పలు కమర్షియల్ యాడ్స్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. అయితే మహేష్ బాబు బాటలోనే తన కుమార్తె సితార కూడా పయనిస్తుందని చెప్పాలి.
మహేష్ బాబు నమ్రత గారాల పట్టి సితార గురించి పరిచయం అవసరం లేదు చిన్నప్పటినుంచి ఎంతో చలాకీగా ఉన్నటువంటి ఈమెకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు నమ్రత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అయితే ఇంత చిన్న వయసులోనే ఇప్పటికే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సితార మరొక రికార్డు సృష్టించారు.
సితార ఇప్పటికే తన తండ్రికి పోటీగా కమర్షియల్ యాడ్స్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇంకా టీనేజ్ లోకి అడుగు కూడా పెట్టకుండానే ఈమె మోడల్ గా ఎంపిక కావడం అందరిని ఎంతో సంతోషానికి గురిచేసింది. ఈమె ఓ నగల తయారీ సమస్తకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలు న్యూయార్క్ నగరంలో తలుక్కుమనడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సితార పాల్గొన్నటువంటి ఈ జ్యువెలరీ యాడ్ ప్రస్తుతం న్యూయార్క్ టైం స్క్వేర్ లో ప్రదర్శించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది మహేష్ బాబు అభిమానులు ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సితార ఇంత చిన్న వయసులోనే ఇలాంటి కమర్షియల్ యాడ్స్ చేసే అవకాశాలను అందుకుంటు తన తండ్రికి గట్టి పోటీగా నిలుస్తున్నారని…భవిష్యత్తులో తన తండ్రిలాగే ఇండస్ట్రీలో కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటూ అభిమానులు ఈ ఫోటోలు వీడియోలను వైరల్ చేస్తున్నారు.
v
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…