Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈమె గతంలో మయోసైటిసిస్ బారిన పడ్డారు. ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోకపోయినప్పటికీ తాను కమిట్ అయిన సినిమాల షూటింగ్ పనులు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే ఈ సినిమాలు పూర్తి కావడంతో సమంత ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించారు.
ఈ విధంగా సినిమాలకు దూరమైనటువంటి ఈమె ఈ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడాలని ఎంతో కష్టపడుతున్నారు. త్వరలోనే ఈ వ్యాధి చికిత్స కోసం ఈమె అమెరికా కూడా వెళ్లబోతున్నారు. అయితే ఈలోపు పలు వెకేషన్ కి వెళుతూ ఈమె ప్రకృతిని ఆస్వాదిస్తూ తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సమంత ప్రస్తుతం పలు వెకేషన్ లకు వెళుతూ ఎంజాయ్ చేయడమే కాకుండా, అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఈమె ఒక వీడియోని షేర్ చేసారు .ఈ వీడియోలో భాగంగా నాలుగు డిగ్రీల చల్లని నీళ్లలో ఏకంగా ఆరు నిమిషాల పాటు కదలకుండా ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియోని సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఐస్ బాత్స్.. ఫోర్ డిగ్రీస్.. సిక్స్ మినిట్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది కూడా తన ట్రీట్మెంట్ లో ఒక భాగమేనని తెలుస్తుంది. ఇలా ఆరోగ్యం కోసం సమంత కఠినమైన సాహసాలు చేస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…