Movie News

Samantha: “ఉ అంటావా..” సాంగ్ కి ఒకే చెప్పడం వెనుక అసలు కారణాలు బయటపెట్టిన సమంత..!

Samantha: సమంత ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈమె నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మొదటిసారిగా స్క్రీన్ పై పుష్ప సినిమాలోని ఉ అంటావా మావా అనే స్పెషల్ సాంగ్ ద్వారా సందడి చేశారు. అయితే ఈ సినిమాలో ఈమె స్పెషల్ సాంగ్ చేయడం ద్వారా ఈమె గురించి ఎన్నో కామెంట్లు విమర్శలు వచ్చాయి.

ఇకపోతే ఈ సినిమాలో మగవారి వ్యవహార శైలిని తప్పుపడుతూ చిత్రీకరించారని పెద్ద ఎత్తున ఈ పాట గురించి వివాదం కూడా చెలరేగింది.ఇకపోతే సమంత ఈ పాటలు ఎందుకు చేసానో తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో ఈమె బయట పెట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా సమంత ఈ స్పెషల్ సాంగ్ లో చేయడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇకపోతే విడాకుల సమయంలో తన గురించి ఎన్నో నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరు తనపై ఎన్నో విమర్శలు చేశారని అయితే వారికి ఏ విధమైనటువంటి సమాధానం చెప్పాలో తన దగ్గర సరైన సమాధానం లేదని సమంత వెల్లడించారు.అదే సమయంలోనే తనకు ఈ పాటలో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా అనిపించిందని ఈ పాట ద్వారా సమాజంలో మహిళలపై పురుషాధిక్యత ఎలా ఉందో అందరికీ తెలియజేయాలని భావించాను. అందుకే ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నానని ఈ సందర్భంగా సమంత ఈ పాట చేయడం వెనుక ఉన్న కారణం బయట పెట్టారు.

భవిష్యత్తులో ఇద్దరి మధ్య సఖ్యత ఉండొచ్చేమో..

ఇకపోతే కరణ్ మీ భర్త గురించి అంటూ నాగచైతన్య పై కొన్ని ప్రశ్నలు అడగబోతుండగా వెంటనే సమంత భర్త కాదు మాజీ భర్త అంటూ కౌంటర్ వేసింది. నాగచైతన్య గురించి ఈమె మాట్లాడుతూ ప్రస్తుతం మా ఇద్దరి మధ్య సఖ్యత లేదు భవిష్యత్తులో మా ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఏర్పడవచ్చు ఏమో అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మాటలు బట్టి చూస్తుంటే సమంత నాగచైతన్య తిరిగి కలుసుకొనేఅవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆశ పడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago