సమంత నాగచైతన్య తో విడాకుల తరువాత తప్పు అంతా సమంతదే అన్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి.ఈ నేపథ్యంలోనే ఆమెకు వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉంది అంటూ వార్తలు కూడా వినిపించాయి.ఈ విషయాలతో విసిగి పోయిన సమంత ఈ వార్తలకు చెక్ పెడుతూ తనఫై వచ్చిన రూమర్స్ ని కొట్టిపడేసింది.ఇక ఆమె విడాకుల బాధ నుంచి కోలుకోవడానికి విహార యాత్రలు కూడా చేసింది.
అయితే సమంత మళ్ళీ వరుస ఆఫర్లతో బిజీ కావాలని ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలోనే సమంత బాలీవుడ్ పై దృష్టి పెడుతున్నారు అంటూ వార్తలు వచ్చినా ఆ వార్తల గురించి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. ఇక సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటుగా అందరినీ కలుపుకుని వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి రిలీజ్ అయిన నాటునాటు సాంగ్ కి సమంత ఆ పాట గురించి పాజిటివ్ గా స్పందించారు.సమంత ప్రవర్తన, ఆలోచలనను బట్టి చూస్తే సమంత ప్రస్తుతం టాలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. పెద్ద హీరోల సినిమాలలో ఛాన్స్ వస్తే సమంత జాతకం మారుతుందని చెప్పాలి.ఇది ఇలా ఉంటే రాజమౌలి, మహేష్ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ గా సమంత నటించబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే మహేష్ సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన దూకుడు,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.అయితే రాజమౌళి మహేష్ కాంబో సినిమాలో సమంతకు నిజంగా ఛాన్స్ దక్కిందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి . మహేష్ రాజమౌళి కాంబో మూవీ దాదాపుగా 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. సమంత కూడా పెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…