Featured

2022 జనవరిలో మినీ బిగ్ బాస్..హోస్ట్ గా సమంత?

తెలుగులో ఇంతవరకు చాలానే రియాల్టీ షోలు వచ్చాయి. కానీ బిగ్ బాస్ అంత హిట్ కాలేదనే చెప్పాలి. మొదటి సీజన్ నుంచి కూడా దీనికి టీఆర్పీ రేటింగ్ బాగానే వస్తోంది. ఇప్పటికే తెలుగులో ఐదో సీజన్ కూడా ముగింపు దశకు చేరుకుంది. ఇక రెండు రోజుల్లో శుభం కార్డు పనడనుంది. అయితే బిగ్ బాస్ మిస్ అవుతున్నాం అని బాధపడే వారికి ఇప్పుడు చెప్పే న్యూస్ కొద్దిగా శుభవార్తే అని చెప్పాలి.

ఎందుకంటే.. వచ్చే సంవత్సరం జనవరి నుంచి మినీ బిగ్ బాస్ షో ప్రసారం కానుందంట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అది టెలివిజన్లో కాకుండా.. ఓటీటీలో ప్రారంభించనున్నారనేది తెలుస్తోంది. అవును మీరు విన్నది నిజమే.. బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో జనవరి 2022లో ప్రారంభించబడే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న కొన్ని వార్తలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

బిగ్ బాస్ ఓటీటీని నెట్‌ఫ్లిక్స్ లేదా ఆహాలో ప్రీమియర్ అవుతుందనేది సమాచారం. ఇక బిగ్ బాస్ తెలుగు ఓటీటీని ఎవరు హోస్ట్ చేస్తారనే దానిపై చాలా ఊహాగానాలు ఉన్నాయి. బిగ్ బాస్ ఓటీటీలోకి కొత్త హోస్ట్‌ని ఎంపిక చేయాలని షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని వినికిడి. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ప్రస్తుత షోకి నాగార్జున హోస్ట్ కాగా.. దీనికి మాత్రం కొత్తవాళ్లను తీసుకోవాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటీ హిందీ వెర్షన్‌లో కూడా అసలు సీజన్ ప్రారంభానికి ముందు షోను హోస్ట్ చేసింది సల్మాన్ ఖాన్ కాదు కరణ్ జోహార్ అనే విషయం అందరికీ తెలిసిందే. దీని ద్వారానే కొత్తగా తెలుగులో కూడా ఓటీటీ బిగ్ బాస్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం పలువురు టాలీవుడ్ నటీనటులు ఆహా, టీవీ ఛానళ్లలో సెలబ్రిటీల టాక్ షోలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల, జూనియర్ ఎన్టీఆర్ జెమినీ టీవీలో హోస్ట్ చేస్తున్న తన గేమ్ షో ‘EMK’ని ముగించాడు. ఆహాలో ప్రసారమయ్యే సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’తో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ 4 సమయంలో ఓ రోజు నాగార్జున అందుబాటులో లేని పక్షంలో సమంత వారాంతపు హోస్ట్ గా చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీకి సమంతా కొత్త హోస్ట్ కావచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago