Movie News

Samyuktha Menon: నాకు నటన రాదని కామెంట్లు చేశారు… నటి సంయుక్త మీనన్ కామెంట్స్ వైరల్!

Samyuktha Menon: మలయాళ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయి అనంతరం భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి సంయుక్త మీనన్. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం కళ్యాణ్ రామ్ బింబిసారా, ధనుష్ సార్ సినిమాల ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను అందుకున్నారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో మంచి సక్సెస్ సాధించిన ఈమె తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈమె ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ అంటూ దర్శక నిర్మాతలు ఈమెతో సినిమాలు చేయడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు.ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంయుక్త పలు విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి రాకముందు తన ఏకైక లక్ష్యం మంచి ఉద్యోగంలో స్థిరపడటమే. తనకు సినిమా ఇండస్ట్రీపై ఏమాత్రం అవగాహన లేదని తెలిపారు. అయితే అనుకోకుండా మలయాళంలో పాప్ కార్న్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలియజేశారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన తనకు వరుస అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. పాప్ కార్న్ సినిమా చేసే సమయంలో తనకు సినిమాపై ఎలాంటి అవగాహన లేదు.

Samyuktha Menon: స్క్రిప్ట్ పై అవగాహన ఉండేది కాదు…


ఈ క్రమంలోనే ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది ప్రేక్షకులు తనని భారీగా ట్రోల్ చేశారని తెలిపారు. అసలు ఈమెకు నటించడమే రాదు అంటూ కామెంట్లు కూడా చేశారని తెలియజేశారు.నిజానికి నాకు అప్పుడు నటన గురించి అవగాహన లేదు అయితే ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా మంచి అవగాహన వచ్చింది అలాగే ఇండస్ట్రీపై కూడా మంచి అవగాహన రావడంతో సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఈ సందర్భంగా సంయుక్త మీనన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago