Samyuktha Menon: మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంయుక్త మీనన్ ఆ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.
ఆ తర్వాత తెలుగులో బింబిసారా, సార్ వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది హిట్ అందుకుంది. ఇక ఇటీవల విరూపాక్ష సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇలా వరుస హిట్లు అందుకుంటూ లక్కీ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. దీంతో టాలీవుడ్ లో కుడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటుంది. అయితే ఇలా వరుస హిట్లు అందుకోవడంతో రెమ్యునరేషన్ కూడా కూడా భారీగా పెంచేసింది.
తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా మంచి మంచి అవకాశాలు అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఇటీవల మీడియా ముందుకి వచ్చిన సంయుక్త తన సక్సెస్ సీక్రెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో సంయుక్త మాట్లాడుతూ..నేను లక్ ని నమ్మను, నా సక్సెస్ సీక్రెట్ ఇదే అంటూ సంయుక్త ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సినిమా హిట్ అనేది మన టాలెంట్, స్క్రిప్ట్ సెలక్షన్ మీదే ఆధారపడి ఉంటుంది. లక్ వలెనే విజయాలు
దక్కుతాయని నేను నమ్మను అంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఈ మలయాళీ బ్యూటీ లక్ ని నమ్మనని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం డెవిల్ సినిమాతో పాటు మరికొన్ని అవకాశాలు కూడ అందుకున్నట్లు తెలుస్తోంది. సంయుక్త జోరు ఇలాగే కొనసాగితే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల లిస్ట్ లో ఒకరిగా నిలుస్తుంది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…