Vijay Devarakonda: పూరి జగన్నాధ్ సినిమా కోసం ఒంటిపై నూలుపోగు లేకుండా విజయ్ దేవరకొండ.. వైరల్ ఫోటో!
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా మారాడు. ఆ సినిమా మంచి హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం మంచి సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఆ తర్వాత విజయ్ నటించిన సినిమాలు అన్ని వరుసగా ఫ్లాప్ అయ్యాయి.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా కూడా అందరి అంచనాలను తారుమారు చేస్తూ విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక తాజాగా విజయ్ దేవరకొండ గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరుస ఫ్లాప్ లు ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ మరొక ప్లాప్ సినిమా నుండి తృటిలో తప్పించుకున్నాడని తెలుస్తుంది. ఆ సినిమా మరేదో కాదు ఇటీవల విడుదలైన ” అన్నీ మంచి శకునములే ” సినిమా.
నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పెళ్లిచూపులు సినిమా హిట్ అయిన తర్వాత నందిని రెడ్డి మొదట ఈ సినిమాని విజయ్ దేవరకొండకి వినిపించిందట. విజయ్ కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత విజయ నటించిన అర్జున్ రెడ్డి సినిమా విడుదలై విజయ్ క్రేజ్ పెరిగిపోవడంతో ఈ సినిమా విజయ్ రేంజ్ కి సరిపోదని నందిని రెడ్డి భావించారట.
విజయ్ దేవరకొండకు ఈ సినిమా సెట్ అవ్వదు అని భావించిన నందిని రెడ్డి ఆ తర్వాత ఈ సినిమా స్టోరీని సంతోష్ శోభన్ కి వినిపించి సినిమాని రూపొందించింది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఇటీవల విడుదలైన ఈ సినిమా అందరి అంచనాలను తారుమారు చేస్తూ ప్లాఫ్ గా నిలిచింది. ఇలా నందిని రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల విజయ్ మరొక ఫ్లాప్ నుండి బయటపడ్డాడు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంత తో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…