Movie News

Pavitra Lokesh -Naresh: మనసులు కలిసాయి అందుకే కలిసి ఉంటున్నాం.. లేటు వయసులో నరేష్ ఘాటు ప్రేమ..?

Pavitra Lokesh -Naresh: సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయనిర్మల వారసుడైన నరేష్ హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి కీలకపాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా నరేష్ తరచూ వార్తలు నిలుస్తున్నాడు. పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్న నరేష్ ఇటీవల ఆమెతో కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

తొందర్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులలో నరేష్ పవిత్ర లోకేష్ బిజీగా ఉన్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక టీవీ షోలో పాల్గొన్న నరేష్ పవిత్ర లోకేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీవీ షోలో వారి ప్రేమ గురించి నరేష్ మాట్లాడుతూ ఆకాశం విరిగిపడినా, భూమి బద్దలైన కూడా తామిద్దరూ ఎప్పుడు కలిసి ఉంటామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కూడా కురిపించుకున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా వీరిద్దరు చేస్తున్న పనుల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కర్ణాటక మీడియా ముందుకు వచ్చిన నరేష్ మరొకసారి పవిత్ర లోకేష్ తో తన రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పవిత్ర లోకేష్ తో సహజీవనం గురించి నరేష్ మాట్లాడుతూ.. ఇద్దరి మనసులు కలిసాయి కాబట్టి ఇద్దరం కలిసే ఉంటున్నామని తెలిపాడు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు.

Pavitra Lokesh -Naresh: లేటు వయసులో ఘాటు ప్రేమలు…


ఇప్పటికే న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకుని వారు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. లేటు వయసులో ఈ ప్రేమ పెళ్లి ఎందుకు అంటూ విమర్శలు గుప్పించారు . అయితే ఆ తర్వాత అది కేవలం సినిమా కోసం మాత్రమే అని వెల్లడించారు. ఇక ఇది ఎలా మీడియా ముందుకు వచ్చిన నరేష్ భవిష్యత్తులో పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పటంతో మరొకసారి వీరి వ్యవహారం వార్తల్లో నిలిచింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago