Rashmika: సాధారణంగా సినిమా సెలబ్రిటీల మీద అందరికీ ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వారు ఏం చేసినా ఏం మాట్లాడినా కూడా నిమిషాలలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పొరపాటున మాట్లాడిన మాటల వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా నటి ఐశ్వర్య రాజేష్ కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకుంది.
పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర గురించి ఐశ్వర్య రాజేష్ చేసిన వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్ ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలలో కీలకపాత్రలలో నటించింది. అలాగే తమిళ్ భాషలో హీరోయిన్ గా కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ చేతిలో ఎనిమిది తమిళ సినిమాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఫర్హానా సినిమా ద్వారా ఐశ్వర్య రాజేష్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీవల్లి పాత్రలో రష్మిక కన్నా తానే బాగా నటించేదానినని తెలిపినట్టు రూమర్లు వినిపించాయి. అయితే ఈ వార్తలపై ఐశ్వర్య రాజేష్ స్పందిస్తూ తను మాట్లాడిన మాటలలో అటువంటి ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చింది.
ఇక సోషల్ మీడియాలో ఐశ్వర్య రాజేష్ చేసిన వ్యాఖ్యల గురించి చర్చలు జరుగుతున్న సమయంలో ఈ వివాదంపై రష్మిక కూడా స్పందించింది. ఈ క్రమంలో రష్మిక స్పందిస్తూ ఒక నోట్ విడుదల చేసింది. ఈ నోట్ లో ” హాయ్ లవ్.. ఇప్పుడే జరిగినదంతా చూశాను. నీ మాటలు వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకోగలను. నువ్వు చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీపై నాకున్న ప్రేమ గౌరవం గురించి నీకు తెలుసు. ఫర్హనా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చావు. ఆల్ ది బెస్ట్… అంటూ లవ్ ఎమోజి సెండ్ చేసింది. దీంతో ఈ వివాదానికి చెక్ పడింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…