Anil Ravipudi: పటాస్ సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనిల్ రావిపూడి మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎఫ్ 3 వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి కార్ డైరెక్టర్గా గుర్తింపు పొందాడు. ఇక ప్రస్తుతం నందమూరి బాలయ్య హీరోగా రూపొందుతున్న సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇంతకాలం కామెడీ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్యతో యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ బయటకి రాకపోవడంతో బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య అభిమానులను శాంత పరచటానికి అనిల్ రావిపూడి తనవంతు ప్రయత్నం చేశాడు.
అనిల్ రావిపూడిలో మంచి డైరెక్టరే కాదూ.. మంచి డ్యాన్సర్ కూడా. ఎఫ్ -3 సినిమా సమయంలో కుర్రాడు బాబోయ్ సాంగ్ కు హీరోలతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసి అందరి చేత వావ్ అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు మరొకసారి బాలయ్య పాటకు చిందులు వేసి ఆయనలోని డాన్స్ టాలెంట్ ని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆ డాన్స్ వీడియో వైరల్ గా మారింది.
ఈ క్రమంలో బాలకృష్ణ హీరోగా తన డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా గురించి ఓ విషయాన్ని ఆసక్తికరమైన రీతిలో పంచుకున్నారు. ‘నట్టు లూజు దానా బాలయ్య, బాలయ్య..ఫిట్టు చేయరానా’ అంటూ లారీ డ్రైవర్ సినిమాలోని పాటకు డాన్స్ మాస్టర్లు, ఫైట్ మాస్టర్ లతో కలసి డ్యాన్సులు చేశారు. ఇక ఈ పాట బట్టి చూస్తే ఇప్పటికే ఈ సినిమాలో ఫైట్ సీన్స్ షూటింగ్ ముగిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనీల్ రావిపూడి చేసిన ఈ డాన్స్ వీడియో తెగ వైరల్ అవుతుంది. దీనికి నెటిజన్ల నుండి వివిధ రకాలుగా కామెంట్లు వస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…