Sanaya Irani: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటి నుంచో ఉంది అయితే ఇటీవల కాలంలో కొంతమంది తమకు ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అంటూ డైరెక్ట్ గా ఇంటర్వ్యూలలో తెలియజేస్తున్నారు. ఇలా ఇంటర్వ్యూలలో వారికి ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను తెలియజేస్తున్నారే తప్ప వారిని ఇబ్బందులకు గురి చేసిన వారి పేర్లను మాత్రం వెల్లడించడం లేదు.
ఇక ఇటీవల కాలంలో బాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున సౌత్ ఇండియన్ సెలబ్రిటీలపై ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయడం ఎక్కువైంది. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి సనాయా ఇరానీ చేసిన క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బాలీవుడ్ బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నాను.
ఆ సమయంలో నాకు సినిమాలలో నటించాలని అవగాహన ఆలోచన కూడా లేదు. కానీ సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఒక డైరెక్టర్ నాకు సినిమా అవకాశాలు కల్పిస్తానని పట్టుబట్టారు. దీంతో ఆయన టార్చర్ భరించలేక సినిమా ఆడిషన్ కి వెళ్లాను. అయితే ఆయన ఆడిషన్ కి రమ్మని చెప్పి తనతో బెడ్ షేర్ చేసుకోమని అడిగారు అంటూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
బెడ్ షేర్ చేసుకోవడం..
ఇక ఆ డైరెక్టర్ తో మీటింగ్ పూర్తి అయ్యాక నాకు అర్థమైన విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకునే వారికి అవకాశాలు ఇస్తామని చెప్పి మాకు బెడ్ షేర్ చేసుకునే అలవాటు ఉందా లేదా అని కనుక్కోవడం కోసమే ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేస్తారని అర్థమయింది అంటూ సనయా ఇరానీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఆ డైరెక్టర్ ఎవరు ఏంటి అనే విషయాలను ఈమె కూడా వెల్లడించకపోవడం గమనార్హం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…