Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు ప్రస్తుతం వెండి తెరపై బుల్లితెరపై వరుస సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్న ఈమె త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానుంది. ఇలా వరుస సినిమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు..
ఇకపోతే అనసూయ సోషల్ మీడియా వేదికగా, మీడియా ముందు ఏం మాట్లాడినా వివాదాలకు కారణం అవుతూ ఉంటుంది. ఈమె ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోయినా పలువురు తనని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొన్న ఈమె తనపై వచ్చిన విమర్శలను ఖండించలేక ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించారు.
ముఖ్యంగా ఈమె తన వస్త్రధారణ కారణంగానే విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు. నిత్యం పొట్టి దుస్తులు ధరించడంతో ఈమె డ్రెస్సింగ్ స్టైల్ పై ఎంతో మంది విమర్శలు చేసిన తగ్గేదే లేదంటూ తనకు ఇష్టమైన కంఫర్ట్ ఉన్న దుస్తులను ధరిస్తూ ఉంటారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన కొడుకు గురించి మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. నా స్టైల్ నా కొడుకుకి నచ్చదని ఈమె తెలిపారు.
నా అందాన్ని హైలెట్ చేయాలి..
నేను నడుం పై వరకు ఉన్నటువంటి టీ షర్ట్ పొట్టి నిక్కర్ కనుక వేసుకుంటే నా కొడుకుకు అసలు నచ్చదు ఎందుకు మమ్మీ ఇంత పొట్టి డ్రెస్ వేసుకున్నావ్ పొడవు టాప్ వేసుకోవచ్చు కదా అంటూ నాకు సలహాలు ఇస్తాడు. కానీ నేను వాటిని పట్టించుకోను. నాకు ఏవి కంఫర్ట్ గా ఉంటాయో నా అందాన్ని ఏవి హైలైట్ చేస్తాయో వాటినే వేసుకుంటానని వాడికి అర్థమయ్యేలా చెబుతాను. ఇక వారితో షాపింగ్ వెళ్లిన వారికి నచ్చినవే కొంటారు వారి సెలెక్షన్ విషయంలో నేను వేలు పెట్టనని అనసూయ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…