టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా సందీప్ కిషన్ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సందీప్ కిషన్ కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు అండగా ఉంటానని ప్రకటించారు. ఈ విధంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రెండు సంవత్సరాల పాటు వారి చదువులు అవసరాలను తానే చూసుకుంటున్నట్లు తెలిపాడు.
ఈ క్రమంలోనే హీరో సందీప్ కిషన్ పుట్టినరోజు కావడంతో తన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను మొదలుపెట్టారు. ముఖ్యంగా తన టీమ్ ద్వారా 300 మంది అనాథ పిల్లలకు ఆహారాన్ని పెట్టినట్లు తెలిపారు.ఈ విధంగా ఆహారం పెట్టినప్పుడు వారి కళ్ళల్లో ఆనందం చేపలేనిదని ఈ హీరో తెలిపారు.ఈ విధంగా సందీప్ కిషన్ బాటలోనే మరికొందరు హీరోలు కూడా ముందుకు వచ్చి కరోనా బాధితుల కోసం తమ వంతు సాయం చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే సందీప్ కిషన్ ఈ ఏడాది ఏ1 ఎక్స్‌ప్రెస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ప్రస్తుతం గల్లీ రౌడీ చిత్రం చేస్తుండగానే తాజాగా తన 28 వ సినిమా కూడా ప్రకటించారు.ఆరు సంవత్సరాల క్రితం సందీప్ కిషన్ హీరోగా నటించిన టైగర్ చిత్రానికి దర్శకత్వం వహించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నాడు.హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కథ, కథనాల ప్రకారం ఇది సందీప్ కెరీర్‌లో ఓ ప్రయోగాత్మక చిత్రంలా నిలుస్తుంది. చిత్ర బృందం భావించారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…