300 మంది అనాధలకు సహాయం చేసిన యంగ్ హీరో!

0
95

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా సందీప్ కిషన్ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సందీప్ కిషన్ కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు అండగా ఉంటానని ప్రకటించారు. ఈ విధంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రెండు సంవత్సరాల పాటు వారి చదువులు అవసరాలను తానే చూసుకుంటున్నట్లు తెలిపాడు.

ఈ క్రమంలోనే హీరో సందీప్ కిషన్ పుట్టినరోజు కావడంతో తన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను మొదలుపెట్టారు. ముఖ్యంగా తన టీమ్ ద్వారా 300 మంది అనాథ పిల్లలకు ఆహారాన్ని పెట్టినట్లు తెలిపారు.ఈ విధంగా ఆహారం పెట్టినప్పుడు వారి కళ్ళల్లో ఆనందం చేపలేనిదని ఈ హీరో తెలిపారు.ఈ విధంగా సందీప్ కిషన్ బాటలోనే మరికొందరు హీరోలు కూడా ముందుకు వచ్చి కరోనా బాధితుల కోసం తమ వంతు సాయం చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే సందీప్ కిషన్ ఈ ఏడాది ఏ1 ఎక్స్‌ప్రెస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ప్రస్తుతం గల్లీ రౌడీ చిత్రం చేస్తుండగానే తాజాగా తన 28 వ సినిమా కూడా ప్రకటించారు.ఆరు సంవత్సరాల క్రితం సందీప్ కిషన్ హీరోగా నటించిన టైగర్ చిత్రానికి దర్శకత్వం వహించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నాడు.హాస్య మూవీస్‌ పతాకంపై రాజేష్‌ దండ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కథ, కథనాల ప్రకారం ఇది సందీప్‌ కెరీర్‌లో ఓ ప్రయోగాత్మక చిత్రంలా నిలుస్తుంది. చిత్ర బృందం భావించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here