దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తమ వంతు సహాయంగా కరోనా బాధితులను ఆదుకున్నారు. కొందరు నిత్యవసర వస్తువులను పంపిణీ చేయగా, మరికొందరు ఆక్సిజన్ సిలిండర్ ల కోసం సహాయం చేస్తున్నారు. మరికొంత మంది దాతలు ముందుకు వచ్చి నగదు రూపంలో విరాళాలను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ క్రికెటర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కరోనా బాధితుల కోసం తమవంతు సాయంగా రూ.2 కోట్లు ప్రకటించారు.
ఈ క్రమంలోనే కెంటో ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రజల నుంచి దాదాపు రూ.7 కోట్ల నిధులు సమీకరించనున్నారు. బాధితులకు ఆక్సిజన్ సరఫరా, వైద్య సౌకర్యాలు, వైద్య పరికరాల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ విధంగా దేశంలో నెలకొన్న ఈ కష్ట సమయంలో ఈ జంట
యాక్ట్ గ్రాంట్స్ అనే సంస్థతో చేతులు కలిపారు.
ఈ సంస్థ ద్వారా ఏడు రోజులపాటు విరాళాలను సేకరించి ఆ డబ్బు ద్వారా దేశంలో వీలైనంత మందికి సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.అందరం కలిసికట్టుగా ఉండి సహాయం చేసుకోవడం వల్ల వీలైనంత మంది ప్రాణాలను కాపాడుకోవచ్చనీ ఈ జంట ట్విట్టర్ ద్వారా పేర్కొంది.
ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదుకావడమే కాకుండా, వేల సంఖ్యలో మరణాలు సంభవించడం తమనెంతో కలచివేసిందని అందుకోసమే ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉంటూ వీలైనంత మందికి సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మరెంతో మంది దాతలు వారికి తోచిన విధంగా సహాయ కార్యక్రమాలను చేపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…