దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తమ వంతు సహాయంగా కరోనా బాధితులను ఆదుకున్నారు. కొందరు నిత్యవసర వస్తువులను పంపిణీ చేయగా, మరికొందరు ఆక్సిజన్ సిలిండర్ ల కోసం సహాయం చేస్తున్నారు. మరికొంత మంది దాతలు ముందుకు వచ్చి నగదు రూపంలో విరాళాలను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ క్రికెటర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కరోనా బాధితుల కోసం తమవంతు సాయంగా రూ.2 కోట్లు ప్రకటించారు.

ఈ క్రమంలోనే కెంటో ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రజల నుంచి దాదాపు రూ.7 కోట్ల నిధులు సమీకరించనున్నారు. బాధితులకు ఆక్సిజన్‌ సరఫరా, వైద్య సౌకర్యాలు, వైద్య పరికరాల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ విధంగా దేశంలో నెలకొన్న ఈ కష్ట సమయంలో ఈ జంట
యాక్ట్‌ గ్రాంట్స్‌ అనే సంస్థతో చేతులు కలిపారు.

ఈ సంస్థ ద్వారా ఏడు రోజులపాటు విరాళాలను సేకరించి ఆ డబ్బు ద్వారా దేశంలో వీలైనంత మందికి సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.అందరం కలిసికట్టుగా ఉండి సహాయం చేసుకోవడం వల్ల వీలైనంత మంది ప్రాణాలను కాపాడుకోవచ్చనీ ఈ జంట ట్విట్టర్ ద్వారా పేర్కొంది.

ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదుకావడమే కాకుండా, వేల సంఖ్యలో మరణాలు సంభవించడం తమనెంతో కలచివేసిందని అందుకోసమే ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉంటూ వీలైనంత మందికి సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మరెంతో మంది దాతలు వారికి తోచిన విధంగా సహాయ కార్యక్రమాలను చేపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here