ఆడియన్స్ ను అలరిస్తున్న బిగ్ బాస్ షో క్లైమాక్స్ కు వచ్చింది. ఇక విన్నర్ ఎవరో తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న సన్నీపై అందరిలోనూ అంచానాలు ఉన్నాయి. హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్ల అందరిలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. పెర్ఫెక్ట్ గా ఆట ఆడుతూ.. టాప్ 5లో ఓకరిగా నిలిచారుడు.
సన్నీ తన ఆట, మాట తీరుతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందుకే చాలా వారాలు నామినేట్ అవుతూ వచ్చినప్పటికీ.. ప్రతిసారి అతన్ని సేవ్ చేస్తూనే వచ్చారు. ఈ నెల 19న బిగ్ బాస్ ఐదో సీజన్ కు తెరపడనుంది. దీంతో దీంతో హౌస్‌లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ శ్రీరామ్, మానస్, సిరి, షణ్ముఖ్, సన్నీలకు తమ తమ జర్నీలను చూపిస్తున్నాడు బిగ్‌బాస్.
కాగా ఇప్పటికే శ్రీరామ్, మానస్ ల బిగ్ బాస్ జర్నీని చూపించిన.. తర్వాత తాజాగా సన్ని బిగ్ బాస్ ప్రయాణాన్ని చూపించారు. హౌజ్ లో సన్ని జర్నీకి సంబంధిచిన ఫోటోలు వేరు వేరు చోట్ల పెట్టి సన్నీని ఆహ్వనించారు. తన ఫోటోలను చూసి సన్ని నవ్వు కున్నాడు. అక్కడ ఉన్న ఓ కోతి బొమ్మ చూసి ‘ఓ కాజల్ ఎట్లున్నావ్.. బాగున్నావా’ అంటూ తనదైన శైలిలో నవ్వులు పూయించాడు.
సన్నీ జర్నీపై బిగ్ బాస్ ప్రశంసలు కురిపించారు. సరదా.. సన్నీ రెండూ కూడా ఒకే అక్షరంతో మొదలవుతాయని … ఆటలు, గొడవలు, నిందలు వేసినా.. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. అందిరి మోహాలపై నవ్వులు తీసుకువచ్చి ఎంటర్ టైనర్ గా నిలిచామని.. అందరి మదిలో చెరగని ముద్రవేశామని సన్నీని ఓ రేంజ్ లో పొగిడారు బిగ్ బాస్. అప్నా టైం ఆయేగా.. సన్నీ.. మీ సమయమొచ్చేసింది’ అంటూ సన్నీని ఓ రేంజ్‌లో పొగిడేశాడు బిగ్‌బాస్.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…