Sarath Babu: తెలుగు, తమిళ్ భాషలలో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందిన శరత్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా నటుడిగా రాణిస్తున్న శరత్ బాబు వయసు మీద పడటంతో సినిమాలలో నటించటం కొంతవరకు తగ్గించారు. ఇక తాజాగా శరత్ బాబు” మళ్లీ పెళ్లి ” అనే సినిమాలో కీలక పాత్రలో నటించాడు.
సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ కీలకపాత్రలలో నటించిన ఈ సినిమాలో శరత్ బాబు కూడా ఒక ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమా మూడు రోజుల్లో విడుదల కానుండగా శరత్ బాబు అనారోగ్య సమస్యలతో తాజాగా సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. శరత్ బాబు మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక గొప్ప నటుడు మరణం ఇండస్ట్రీలో అందరినీ కలిసి వేసింది. శరత్ బాబు మరణం గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు అభిమానులు ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి వెళ్తున్నారు.
ఆయన మరణం గురించి ఎంతో మంది సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇదిలా ఉండగా శరత్ బాబు తన చివరి కోరిక తీరకుండానే మరణించినట్లు తెలుస్తోంది. శరత్ బాబు చివరగా నటించిన మళ్లీ పెళ్లి అనే సినిమా మరొక మూడు రోజుల్లో విడుదల కానుండగా శరత్ బాబు సోమవారం మధ్యాహ్నం మరణించాడు. దీంతో తాను నటించిన చివరి సినిమా విడుదల కాకముందే శరత్ బాబు మరణించాడు.
అంతేకాకుండా శరత్ బాబుకి హార్స్లీ హిల్స్ లో స్థిరపడాలని కోరిక. అక్కడ స్థిరపడటం కోసం శరత్ బాబు ఇంటి నిర్మాణం పనులు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇంటి నిర్మాణం పూర్తయి అక్కడ స్థిరపడాలన్న శరత్ బాబు కోరిక నెరవేరకుండానే ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు ఆరు నెలల క్రితం చెన్నై వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి అనారోగ్యం మళ్లీ విషమించటంతో బెంగళూరులో చికిత్స పొందిన తర్వాత ఇటీవల హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు. ఇక తాజాగా మల్టీ ఆర్గాన్ డిసార్డర్ వల్ల సోమవారం మధ్యాహ్నం 1:30 సమయంలో తుది శ్వాస విడిచాడు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…