Featured

Savithri Daughter Chamundeswari : మహానటి సినిమా వల్ల మా ఇంట్లో గొడవలు జరిగాయి… రేఖ అక్క ఫోను చేసి ఏమందంటే…: విజయ చాముండేశ్వరి

Savithri Daughter Chamundeswari : అలనాటి తార సావిత్రి గారు సినిమాల్లోకి వచ్చిన కొద్ది కాలానికే అగ్ర హీరోయిన్ గా ఎదిగి ఇప్పటికీ ఎంతోమందికి నటనలో బెంచ్ మార్క్ సెట్ చేసిన మహానటి. ఆమె వెండి తెర మీద ఒక వెలుగు వెలిగిన నిజ జీవితంలో మాత్రం ఓడిపోయింది. భర్త, నమ్మిన వారు మోసం చేయడం వల్ల ఆర్థికంగానూ, మానసికంగానూ క్రుంగిపోయి మరణించారు. ఆమె జీవితకథను ‘మహానటి’ సినిమాగా తీసి ఆ మహనటి గురించి ఈ తరం వారికి తెలియజేసారు. ఇక సావిత్రి గారి కూతురు విజయ చముండేశ్వరి గారు, ఆమె భర్త గోవిందరావు గారు తన ఇంట్లో భద్రపరుచుకున్న సావిత్రి గారి జ్ఞాపకాలను పంచుకున్నారు.

మహానటి సినిమా వల్ల ఇంట్లో గొడవలు జరిగాయి…

సావిత్రి గారి జీవితం గురించి వచ్చిన మహానటి సినిమా జనాలకు బాగా నచ్చింది. అందరూ సావిత్రమ్మ జీవితంలో జరిగిన మోసాలు, విషాదాల గురించి సినిమాలో చాలా చక్కగా చూపించారు. ఇక సావిత్రి గారి ఇంట్లో మాత్రం మహానటి సినిమా వల్ల బాగా గొడవలు జరిగాయి అంటూ కూతరు విజయ చాముండేశ్వరి గారు తెలిపారు. మొదటి భార్య పిల్లలు సినిమా సరిగా చూపించలేదని సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ను బట్టి నువ్వెలా సినిమాకు ఓకే చెప్పావ్ అని అడిగారట.

అయితే చాముండేశ్వరి గారు కథ చెప్పినపుడు అలానే సినిమాలోనూ నాన్నను చెడ్డగా చూపించలేదని వివరించి చెప్పారట. నిజానికి తెలుగు ప్రజలకు ఆల్రెడీ నాన్న జెమిని గణేషణ్ గారంటే చెడు అభిప్రాయం ముందు నుండి ఉందంటూ చెప్పారట. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కామెంట్స్ పట్టించుకోకండి అని చెప్పారట చాముండేశ్వరి. ఇక బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేఖ ఫోను చేసి జీవిత కథను సినిమాగా తీసినపుడు నిజంగా జరిగినదే చెప్పరు, డైరెక్టర్లు కొంత కల్పితం ఉంటుంది నేను అర్థం చేసుకోగలను, అక్క వాళ్ళు అర్థం చేసుకోడానికి టైం పడుతుంది కొంచెం సమయం వాళ్లకు ఇస్తే సరిపోతుంది అని చెప్పారట రేఖ.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago