Siva balaji : ‘ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివ బాలాజీ ఆ తరువాత ఎలా చెప్పను, దోస్త్ సినిమాల్లో నటించారు. అయితే శివ బాలాజీకి మంచి పేరు తెచ్చిన సినిమా మాత్రం ‘ఆర్య’. ఇక ఆ తరువాత సంక్రాంతి సినిమాతో మరో మంచి హిట్ అందుకున్న శివ బాలాజీ తన 17 ఏళ్ళ వయసులోనే తండ్రి వ్యాపారాలను చూసుకుంటూ 22 ఏళ్లకే సొంత వ్యాపార సంస్థలను పెట్టాడు. ఇక సినిమాల మీద ఆసక్తితి ఇండస్ట్రీ వైపు వచ్చిన శివ బాలాజీ నటి మధుమిత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక తాజాగా రాజకీయాల్లోకి శివ బాలాజీ వస్తున్నాడు అన్న వార్తల నేపథ్యంలో వాటి మీద ఒక ఇంటర్వ్యూలో శివబాలాజీ క్లారిటీ ఇచ్చారు.
రాజకీయాల్లోకి ఎంట్రీ పై క్లారిటీ…
పవన్ కళ్యాణ్ తో మంచి సన్నిహిత్యం ఉన్న శివ బాలాజీ జనసేన తరుపున వాచెస్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు అంటూ వచ్చిన నేపథ్యంలో ఆ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి రావడం లేదని కేవలం జనసేన పార్టీ కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలు నాకు సెట్ కావంటూ బాలాజీ తెలిపారు. రాజకీయాల్లో ఉండాలంటే చాలా ఓపిక ఉండాలని నాకు అంత ఓపిక లేదంటూ తెలిపారు.
పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుండి చూస్తున్నానని, చాలా ఓపికగా ఆయన పార్టీని బలోపేతం చెసుకుంటూ వచ్చారంటూ తెలిపారు. ఆయనకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అసలు రాజకీయాలు అవసరమా లేదా సినిమాల్లో డబ్బు బాగా సంపాదించుకోవచ్చు కానీ ప్రజాసేవ కోసం కష్టపడుతున్నారు, ఆయన సంపాదన అంతా పార్టీ కోసం పెడుతున్నారు అంటూ చెప్పారు. ఇక శివ బాలాజీ భార్య మధుమిత బంధువులు అందరూ కోస్తా ఏరియాలో సెటల్ అయ్యారని హైదరాబాద్ లో ఉన్నా ఎన్నికలప్పుడు వెళ్లి ఓటేసి వస్తారంటూ తెలిపారు. మధుమిత మావయ్య వాళ్ల ఇంట్లో జనసేన పార్టీ నుండి క్రియాశీలకంగా పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…