భారతదేశంలో అత్యాచారాలకు వ్యతిరేకంగా ఎన్నో చట్టాలను తీసుకొచ్చారు. నిర్భయ ఘటన తర్వాత అటువంటి చట్టాలు వివిధ రాష్ట్రాల్లో ఎక్కువగానే వచ్చాయని చెప్పవచ్చు. కానీ ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఎన్ని చట్టాలు పెరిగాయో.. అంతకంటె ఎక్కువగా అత్యాచారాలు కూడా పెరుగుతున్నాయి. దీనిని బట్టి చూస్తే అర్థం అయ్యేది ఏంటంటే.. అటువంటి చట్టాల వల్ల కామాంధులకు ఎలాంటి భయం ఉన్నట్లు అనిపించడం లేదు.
అందుకే ప్రతీ రోజు దేశంలో ఏదో మూల ఇలాంటి అత్యాచార ఘటనల వార్తలు వింటూనే ఉన్నాయి. తాజాగా అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. ఈ సారి ఆ కామాంధుడు ఉపాధ్యాయుడు అయ్యాడు. ఇద్దరు విద్యార్థినలకు స్పెల్లింగ్ నేర్పిస్తానని చెప్పి.. గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆ ఘటన గుజరాత్ లోని రాజ్ కోట్ పట్టణంలో చోటుచేసుకుది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చదువుకునేందుకు పాఠశాలకు వెళ్లిన ఇద్దరు విద్యార్థినిలపై ఓ స్కూల్ డైరెక్టర్ దినేశ్ జోషి కన్నేశాడు. ఎలాగైన తన కామ కోరిక తీర్చుకోవాలని ఓ రోజు వాళ్లిద్దరిని స్పెల్లింగులు నేర్పిస్తానంటూ తన గదికి తీసుకెళ్లాడు. అక్కడ వారితో అతడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. అక్కడ జరిగిన విషయాలను ఆ బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసుల దాకా వెళ్లింది.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆ ఉపాధ్యాయుడు ఇంకా చాలామంది విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చాలా మంది వాళ్లతో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేవారు. దీంతో దాదాపు వందమంది తల్లిదండ్రులు, విద్యార్థినులు లోధిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జోషిపై ఫిర్యాదు చేశారు. అతడిపై వివిధ రకాలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షను అమలు చేయాలని బాధితులు కోరారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…