ప్రపంచ దేశాలలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కరోనా కొత్త కేసులు, వేల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. సాఫీగా సాగుతున్న మనుషుల జీవితాన్ని కరోనా వైరస్ అస్తవ్యస్తం చేసింది. ఈ మహమ్మారిని కట్టడి చేసే సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా సమయమే పట్టే అవకాశం ఉంది. అయితే తాజా పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు మరో కీలకమైన విషయాన్ని వెల్లడించారు.
ఓ బ్లడ్ గ్రూప్ రక్తం కలిగి ఉన్న వాళ్లకు మిగతా బ్లడ్ గ్రూపులతో పోల్చి చూస్తే కరోనా ముప్పు తక్కువని చెబుతున్నారు. డెన్మార్క్, కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు వేర్వేరు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. డెన్మార్క్ పరిశోధకులు అధ్యయనంలో భాగంగా 7,422 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించారు. ఈ బ్లడ్ శాంపిల్స్ ను పరిశీలించగా 44 శాతం ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకు, 38 శాతం మంది ఓ బ్లడ్ గ్రూప్ వాళ్లకు కరోనా సోకినట్టు వెల్లడైంది.
కెనడాకు చెందిన పరిశోధకులు ఐసీయూలో ఉన్న కరోనా రోగుల గురించి పరిశోధనలు చేసి ఆ పరిశోధనల ఫలితాలను వెల్లడించారు. ఏ, ఏబీ బ్లడ్ గ్రూపుల వాళ్లలో 84 శాతం మంది వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే మిగిలిన బ్లడ్ గ్రూపులైన బీ, ఓ బ్లడ్ గ్రూపులలో కేవలం 61 శాతం మంది మాత్రమే వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఫిజీషియన్ మైపిండర్ సెఖన్ మాట్లాడుతూ మిగతా బ్లడ్ గ్రూపులతో పోలిస్తే ఓ బ్లడ్ గ్రూపుపై కరోనా ప్రభావం తక్కువగా ఉందని అన్నారు.
ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన వాళ్లకు కరోనా సోకదని తమ అధ్యయనన చెప్పడం లేదని ఇతర బ్లడ్ గ్రూపులతో పోలిస్తే ముప్పు తక్కువ అని మాత్రమే చెబుతున్నామని అన్నారు. మరోవైపు 2021 జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…