ప్రపంచ దేశాలలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కరోనా కొత్త కేసులు, వేల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. సాఫీగా సాగుతున్న మనుషుల జీవితాన్ని కరోనా వైరస్ అస్తవ్యస్తం చేసింది. ఈ మహమ్మారిని కట్టడి చేసే సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా సమయమే పట్టే అవకాశం ఉంది. అయితే తాజా పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు మరో కీలకమైన విషయాన్ని వెల్లడించారు.

 

ఓ బ్లడ్ గ్రూప్ రక్తం కలిగి ఉన్న వాళ్లకు మిగతా బ్లడ్ గ్రూపులతో పోల్చి చూస్తే కరోనా ముప్పు తక్కువని చెబుతున్నారు. డెన్మార్క్, కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు వేర్వేరు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. డెన్మార్క్ పరిశోధకులు అధ్యయనంలో భాగంగా 7,422 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించారు. ఈ బ్లడ్ శాంపిల్స్ ను పరిశీలించగా 44 శాతం ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకు, 38 శాతం మంది ఓ బ్లడ్ గ్రూప్ వాళ్లకు కరోనా సోకినట్టు వెల్లడైంది.

కెనడాకు చెందిన పరిశోధకులు ఐసీయూలో ఉన్న కరోనా రోగుల గురించి పరిశోధనలు చేసి ఆ పరిశోధనల ఫలితాలను వెల్లడించారు. ఏ, ఏబీ బ్లడ్ గ్రూపుల వాళ్లలో 84 శాతం మంది వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే మిగిలిన బ్లడ్ గ్రూపులైన బీ, ఓ బ్లడ్ గ్రూపులలో కేవలం 61 శాతం మంది మాత్రమే వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఫిజీషియన్ మైపిండర్ సెఖన్ మాట్లాడుతూ మిగతా బ్లడ్ గ్రూపులతో పోలిస్తే ఓ బ్లడ్ గ్రూపుపై కరోనా ప్రభావం తక్కువగా ఉందని అన్నారు.

ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన వాళ్లకు కరోనా సోకదని తమ అధ్యయనన చెప్పడం లేదని ఇతర బ్లడ్ గ్రూపులతో పోలిస్తే ముప్పు తక్కువ అని మాత్రమే చెబుతున్నామని అన్నారు. మరోవైపు 2021 జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here