కోటీశ్వరులు కావాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అయితే కొందరు మాత్రమే ఆ కలలను నిజం చేసుకోగలుగుతారు. అయితే చాలామంది ఎంతో కష్టపడితే మాత్రమే డబ్బు సంపాదించడం సాధ్యమవుతుందని భావిస్తూ ఉంటారు. కానీ తెలివితేటలే పెట్టుబడిగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వాళ్లు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. తక్కువ మొత్తం పెట్టుబడితో అదిరిపోయే లాభాలను అందించే స్కీమ్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి.
ఈ స్కీమ్స్ లో పెట్టుబడులు పెడితే ఎలాంటి రిస్క్ ఉండదు. అదే సమయంలో ఖచ్చితమైన లాభం ఉంటుంది. అలా కేంద్రం అందించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ద్వారా ఖచ్చితమైన లాభాలను ఆర్జించవచ్చు. అయితే ఈ పథకంలో చేరి డబ్బులు సంపాదించాలంటే దీర్ఘకాలం పాటు వేచి ఉండటం చాలా అవసరం. ఓపిక, సహనంతో దీర్ఘకాలం పాటు వేచి ఉంటే మాత్రమే సులభంగా మనం అనుకున్న ఫలితాలను సాధించే అవకాశాలు ఉంటాయి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. నెలకు 12,500 రూపాయల చొప్పున పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో 25 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా కోటి రూపాయలు మీ సొంతమవుతాయి. మనం ఇన్వెస్ట్ చేసే మొత్తం 37 లక్షల రూపాయలు కాగా 65 లక్షల రూపాయలకు పైగా లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాను తెరవాలని అనుకునే వాళ్లు దగ్గరలోని బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
సాధారణంగా పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు కాగా ఆ గడువును అవసరాలకు అనుగుణంగా పొడిగించుకోవచ్చు. పీపీఎఫ్ అకౌంట్ గడువును ఐదు సంవత్సరాల చొప్పున పెంచుకునే అవకాశం ఉంటుంది. పీపీఎఫ్‌లో పెట్టే డబ్బులకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా లభిస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే నెలకు గరిష్టంగా 12,500 రూపాయలు మాత్రమే డిపాజిట్ చేసే అవకాశం ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…