కోటీశ్వరులు కావాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అయితే కొందరు మాత్రమే ఆ కలలను నిజం చేసుకోగలుగుతారు. అయితే చాలామంది ఎంతో కష్టపడితే మాత్రమే డబ్బు సంపాదించడం సాధ్యమవుతుందని భావిస్తూ ఉంటారు. కానీ తెలివితేటలే పెట్టుబడిగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వాళ్లు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. తక్కువ మొత్తం పెట్టుబడితో అదిరిపోయే లాభాలను అందించే స్కీమ్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

 

ఈ స్కీమ్స్ లో పెట్టుబడులు పెడితే ఎలాంటి రిస్క్ ఉండదు. అదే సమయంలో ఖచ్చితమైన లాభం ఉంటుంది. అలా కేంద్రం అందించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ద్వారా ఖచ్చితమైన లాభాలను ఆర్జించవచ్చు. అయితే ఈ పథకంలో చేరి డబ్బులు సంపాదించాలంటే దీర్ఘకాలం పాటు వేచి ఉండటం చాలా అవసరం. ఓపిక, సహనంతో దీర్ఘకాలం పాటు వేచి ఉంటే మాత్రమే సులభంగా మనం అనుకున్న ఫలితాలను సాధించే అవకాశాలు ఉంటాయి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. నెలకు 12,500 రూపాయల చొప్పున పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో 25 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా కోటి రూపాయలు మీ సొంతమవుతాయి. మనం ఇన్వెస్ట్ చేసే మొత్తం 37 లక్షల రూపాయలు కాగా 65 లక్షల రూపాయలకు పైగా లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాను తెరవాలని అనుకునే వాళ్లు దగ్గరలోని బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

సాధారణంగా పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు కాగా ఆ గడువును అవసరాలకు అనుగుణంగా పొడిగించుకోవచ్చు. పీపీఎఫ్ అకౌంట్ గడువును ఐదు సంవత్సరాల చొప్పున పెంచుకునే అవకాశం ఉంటుంది. పీపీఎఫ్‌లో పెట్టే డబ్బులకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా లభిస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే నెలకు గరిష్టంగా 12,500 రూపాయలు మాత్రమే డిపాజిట్ చేసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here