సాధారణంగా ఏ పాఠశాలలో అయినా అమ్మాయిలకు షర్ట్, స్కర్ట్ స్కూల్ యూనిఫామ్ గా ఉంటుంది. అదేవిధంగా అబ్బాయిలకు షర్ట్ ప్యాంట్ యూనిఫామ్ ఉంటుంది. కచ్చితంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు యూనిఫామ్ నిబంధనలు పాటించే వెళ్లాలి. కానీ ఓ విద్యార్థి మాత్రం పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా షర్ట్ కి బదులుగా తన అక్క షర్ట్, స్కర్ట్ ధరించి స్కూలుకు వెళ్లిన ఘటన స్కాట్లాండ్ లో చోటు చేసుకుంది. ఈ విధంగా బాలుడు తన సిస్టర్ దుస్తులు ధరించి పాఠశాలకు వెళ్లడానికి కారణం లేకపోలేదు. మరి ఆ కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
స్కాట్లాండ్ లోని Dumfries and Galloway ప్రాంతంలో ఉన్న మోఫాట్ అకాడమీ అనే స్కూల్‌లో చదువుతున్న షేన్ రిచర్డ్‌సన్ స్కర్ట్ ధరించి స్కూల్‌కు హాజరయ్యాడు. రిచర్డ్ సన్ మాదిరిగానే మరో 12 మంది అబ్బాయిలు స్కర్ట్ ధరించి పాఠశాలకు వెళ్లగా పాఠశాలల్లోని విద్యార్థులు వీరి వైపు వింతగా చూశారు. ఈ క్రమంలోనే పాఠశాల యాజమాన్యం వారిని తిరిగి ఇంటికి పంపించారు.
స్కూల్ నిబంధనల ప్రకారం అబ్బాయిలు కేవలం ప్యాంటు, చొక్కా ధరించిన వారికి మాత్రమే అనుమతించి మిగతా వారిని తిరిగి ఇంటికి పంపించారు. ఈ క్రమంలోనే పాఠశాల నియమానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని రిచర్డ్‌సన్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తన సిస్టర్ వద్ద నుంచి స్కర్ట్ తీసుకుని.. దానిని ధరించి స్కూల్‌కు హాజరయ్యాడు.
రిచర్డ్‌సన్ ఈ విధమైన నిర్ణయాన్ని చేసుకోవడానికి గల కారణాన్ని Daily Mailతో మాట్లాడుతూ అసలు విషయాన్ని తెలిపాడు. ప్రస్తుతం వ్యాపించి ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో తరగతి గదిలో ఎయిర్ కండిషనర్స్ ఆన్ చేయడం లేదు. దీంతో క్లాస్ రూమ్స్‌లో చాలా వేడిగా ఉండటం వల్లే నా సిస్టర్ స్కర్ట్ ధరించి స్కూల్ కు హాజరయ్యానని తెలిపారు. ఈ క్రమంలోనే కొందరు అమ్మాయిలు కూడా షార్ట్ ధరించి స్కూల్ కి రావడంతో పాఠశాల యాజమాన్యం వారిని మందలించినట్టు తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…