Senior Actor Chandhra Mohan : మల్లంపల్లి చంద్ర శేఖర్ రావు అంటే ఎవరికీ తెలియదు కానీ చంద్ర మోహన్ అంటే మాత్రం అందరికీ తెలుసు. హీరోగా, సహ నటుడుగా, కమెడియన్ గా ఇలా ఎన్నో పాత్రలు చేసిన చంద్ర మోహన్ గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంత కాలంగా పెద్దగా కనిపించక పోయినా ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సినిమా విశేషాలతో పాటు అటు తన భార్య అలాగే ఇంటిని చూపించారు. ఆయన ఎంతో ఇష్టంగా వారి అభిరుచులకు తగ్గట్టు కట్టుకున్న ఆ ఇల్లు చాలా ఆకర్షనియంగా ఉంది.
చంద్ర మోహన్ గారి హోమ్ టూర్ వీడియో…
చంద్ర మోహన్ గారు నూరుకు పైగా సినిమాల్లో హీరోగా నటించారు. ఆయనతో మొదటి సినిమా చేసిన హీరోయిన్ ఆ తరువాత స్టార్ హీరోయిన్ అవుతుందన్న సెంటిమెంట్ ఆరోజుల్లో ఉండేది. ఇక ఆయన వ్యక్తిగత జీవితంలోకి వస్తే ఆయన భార్య జలందర గారు రచయిత. ఇక ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగా ఇటీవలే యూట్యూబ్ లో ఆయన హోమ్ టూర్ వీడియో చేసారు. ఇల్లు చంద్రమోహన్ గారు జలందర అభిరుచికి తగ్గట్టు చెట్లు పక్షుల మధ్య చాలా ఆహ్లాదంగా ఉంది. పల్లెటూరి వాతావరణం అంటే చాలా ఇష్టం అందుకే ఇల్లు ఇలా నిర్మించుకున్నాం అంటూ చంద్రమోహన్ తెలిపారు.
ఇక ఆయన ఇంటి వెనుక భాగంలో విశాలంగా చెట్లను పెంచుతూ పెద్ద తొట్టి ఏర్పాటు చేసి అందులో రకరకాల చేపలను కూడా పెంచుతున్నారు. అంతే కాకుండా విభిన్నంగా ఆయన కోళ్లను అది కూడా రకరకాల అరుదైన జాతుల కోళ్లను పెంచుకుంటున్నారు. జంతువులు పక్షుక్ల మధ్య ఉంటే ప్రశాంతత వేరుగా ఉంటుందంటూ తాను ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్న చంద్ర మోహన్ లా కాకుండా ఒక యోగిలా, సన్యాసి లా దైవ చింతనలో ఉన్నానంటూ చెప్పారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…