Featured

Senior actor Dev Raj : 11 మంది పోలీసులను చంపిన చోట వీరప్పన్ నా భుజం మీద చేయి వేసి… ఆ సమయంలో 11 కిలోమీటర్లు పరిగెత్తాం…: సీనియర్ నటుడు దేవ్ రాజ్

Senior actor Dev Raj : ఎర్ర మందారం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ గా మంచి పేరు తెచ్చుకుని దాదాపు అందరు అగ్ర హీరోల సినిమాల్లోనూ విలన్ గా నటించిన కన్నడ నటుడు దేవ్ రాజ్ గారు. ఆయన మొదట విలన్ గా చేసినా ఆపైన కన్నడ సినిమాల్లో హీరోగా చాలా సినిమాల్లో చేసారు. ఒకవైపు విలన్ గా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మరో వైపు హీరో గాను మంచి హిట్స్ అందుకున్నారు. ఎపుడూ తెలుగు మీడియాకు పెద్దగా కనిపించని దేవ్ రాజ్ గారు లేటెస్ట్ గా ఇంటర్వ్యూలో పాల్గొని అయన కుటుంబం అలాగే కెరీర్ గురించి మాట్లాడారు.

వీరప్పన్ సినిమా చేసినపుడు బాగా భయపడ్డాం…

ఒకప్పుడు గంధం చెక్కల దొంగ వీరప్పన్ అంటే తమిళ నాడు, కర్ణాటక పోలీసులకు కత్తి మీద సాము లాగా ఉండేది. వీరప్పన్ యాక్టీవ్ గా ఉన్న రోజుల్లోనే ఎంతో మంది పోలీసులని చంపిన రోజుల్లోనే ఆయన మీద సినిమా ఆయన సొంతూరు పరిసరాల్లో తీయడం, అందులో నటించడం పెద్ధ రిస్క్. అలాంటి రిస్క్ చేసారు విలన్ దేవరాజ్. ఆ సినిమా విశేషాలను షూటింగ్ టైంలో జరిగిన సంఘటనలను తెలిపారు. ఆ సినిమా షూటింగ్ మొత్తం అడవిలో వీరప్పన్ తిరిగే చోటే చేశారు. ఆయన 11 మంది పోలీసులను చంపేసిన లొకేషన్ లోనే షూటింగ్ చేసినపుడు సాయంత్రం 5 గంటలకల్లా షూటింగ్ ముగించుకుని వెళ్లిపోవాలని అందరం అనుకున్నాం.

రెండు జీపులలో కొద్ది మంది సిబ్బందితో వచ్చాము. ఇక ఆ లొకేషన్ లో ఎవరూ ఉండే ఆస్కారం లేదు, అది బాగా డీప్ ఫారెస్ట్. అయితే ఒక మనిషి కనిపించడంతో కొంచం టెన్షన్ పడి అందరం ప్యాక్ చేసుకుని వెళ్లే టైములో నా వెనక నుండి ఒకరు చేయి వేశారు. నేను సినిమా టీం అనుకున్నా, మాట్లాడి వెనక్కి తిరిగి చూసే సరికి కిలోమీటర్ దూరంలో పరిగేత్తుతూ ఉన్నాడు. అందరం భయపడి అక్కడి నుండి 11 కిలోమీటర్లు ఆగకుండా జీపుల వెనుక పరిగెత్తి వచ్చాము. ఆ రోజును ఇప్పటికీ మర్చిపోలేను, నా వెనుక చేయి వేసింద వీరప్పానో కాదో నాకు తెలియదు కానీ ఆ రోజు బాగా టెన్షన్ పడ్డాము అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

క్యాబ్ లో బాలుడిని మర్చిపోయిన తల్లితండ్రులు..అస్సలు ఏమైందంటే..?

బెంగళూరులో ఓ కుటుంబం గడచిన రోజుల్లో అనుభవించిన సంఘటన వాస్తవానికి ప్రతి తల్లిదండ్రి గుండెను గుద్దేసేలా ఉంది. రాత్రి ఇంటికి…

40 minutes ago

30 ఏళ్ళ ఉద్యోగ ప్రతిష్టకు… లగ్జరీ కార్లతో సర్‌ప్రైజ్ చేసిన కంపెనీ..

కేరళలోని ప్రముఖ రిటైల్‌ స్పేస్ కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులను అదిరిపోయే విధంగా సర్‌ప్రైజ్…

53 minutes ago

నో చికెన్.. నో మటన్! టీమిండియా నెక్స్ట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కఠిన నిర్ణయం..

టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్‌డ్ పేర్లలో ఒకరు.…

1 hour ago

సర్పంచులకు భారీ ఊరట..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…

1 hour ago

ప్రసవ వేదనతో ఆవేదనాత్మక ఘటన.. ఉత్తరప్రదేశ్‌లో సంచలనం..!

ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…

1 hour ago

రూ.75 కోట్ల ‘మండాడి’లో సుహాస్ షాకింగ్ రోల్.. రూట్ మార్చిన యంగ్ హీరో

తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్‌లో సుహాస్ ఇప్పుడు…

2 hours ago