Featured

Senior actor GV Narayana rao : చిరంజీవి, సురేఖ పేరు మీద రైట్స్ రాయించుకుని మాకు తలా ఐదు లక్షలు ఇప్పించాడు… హరిప్రసాద్ లైవ్ లో చనిపోయాడు : జీవీ నారాయణ రావు

Senior actor GV Narayana rao : అంతులేని కథ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు జీవీ నారాయణ రావు గారు ఆ సినిమా తరువాత హీరోగాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక ప్రొడ్యూసర్ గా మారి చిరంజీవి గారితో దేవాంతకుడు, అలాగే ఫ్రెండ్స్ తో కలిసి యముడికి మొగుడు సినిమాలను తీసి మంచి హిట్స్ అందుకున్నారు. ఇక చిరంజీవి గారితో స్నేహితులతో కలిసి సినిమా నిర్మిస్తున్న సమయంలో వచ్చిన విబేధాలు వంటి విషయాల మీద అయన మాట్లాడారు.

రైట్స్ రాయించుకుని ఐదు లక్షలు ఇచ్చారు…

హిందీ సినిమా కథను తీసుకుని ఇద్దరు హీరోలు ఉన్న స్టోరీ ని మార్చి ఒక హీరో కథగా చేసి చిరంజీవి గారితో ‘దేవాంతకుడు’ సినిమా తీసి హిట్ అందుకున్నారు జీవీ నారాయణ రావు గారు. ఇక ఆ సినిమా ఘన విజయం సాధించడంతో చిరంజీవి గారు పిలిచి తన పాత రూమ్మేట్స్ అయిన సుధాకర్, హరిప్రసాద్ లను కలుపుకుని ఒక సినిమా చేద్దాం, నీకు అనుభవం ఉంది వాళ్లకు డబ్బు వస్తుంది అని చెప్పడం వల్ల డైనమిక్ బ్యానర్స్ అనే సంస్థను పెట్టి ‘యముడికి మొగుడు’ సినిమాను తీశారు.

అయితే ఆ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే పది లక్షలు ఎక్కువ అవడంతో ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో చిరంజీవి సినిమా ఎలా అనుకున్నారో అలా తీయండి మీకు చెరో ఐదు లక్షలు లాభం వచ్చేలా నేను చూసుకుంటా అని హామీ ఇచ్చారు. దీంతో అరవింద్ గారు ఎలాగూ చిరంజీవి గారు మాటిచ్చారు కదా చెరో ఐదు లక్షలు తీసుకోండి సినిమా రైట్స్ చిరంజీవి, సురేఖ మీద రాసిచ్చేయండి అని చెప్పి ఐదులక్షలు ఇచ్చారు. ఎలాంటి విబేధాలు రాకుండా సినిమా అయింది. సినిమా వల్ల అందరూ లాభంపడ్డాము అంటూ చెప్పారు. ఇక ఆ సమయంలో హరిప్రసాద్ గారికి చిరు కి విబేధాలు వచ్చాయి అన్నది ఒట్టి పుకారు అంటూ చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ తరుపున ఖమ్మం జిల్లాకు పనిచేస్తున్న హరిప్రసాద్ ఒక న్యూస్ ఛానెల్ లైవ్ డిబేట్ లో పాల్గొనగా అక్కడే గుండె పోటు రావడం హాస్పిటల్ తీసుకెళ్లినా మరణించాడు, లైవ్ లో అలా జరిగింది. ఎవరు ఎప్పుడు ఎలా పోతారో తెలియదు అంటూ ఎమోషనల్ అయ్యారు.

Bhargavi

Recent Posts

రోజంతా తేలికగా ఉండాలంటే ఉదయం ఈ హ్యాబిట్స్ తప్పనిసరి! గ్యాస్, బ్లోటింగ్‌ సమస్యకు ఇంట్లోనే సులభ పరిష్కారం!

ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…

25 minutes ago

కోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ 23న ఆధ్యాత్మిక మహోత్సవం!

తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…

1 hour ago

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

15 hours ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

15 hours ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

15 hours ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

16 hours ago