Featured

Lyricist Jonnavithula : అందరూ కలిసి పిండాలు, శాపనార్థాలు పెట్టారు… కోర్ట్ కి వస్తే చెప్పులు విసిరారు : జొన్నవిత్తుల రామలిగేశ్వరరావు

Lyricist Jonnavithula : తెలుగు సినిమాకు సాహిత్యం అందిస్తూ గుర్తింపు తెచ్చుకున్న జొన్నవిత్తుల గారు ఎన్నో పేరడి పాటలను రాశారు. ఇక సినిమాల్లో పాటలు రాయడమే కకుండా తెలుగు భాషకు సేవ చేస్తున్నారు, అలా పద్యాలు రాస్తుంటారు. వివాదరహితంగా తన పని తాను చూసుకునే జొన్నవిత్తుల గారు మంచు విష్ణు సినిమా ‘దేనికైనా రెడీ’ విషయంలో వివాదాస్పదం అయ్యారు. బ్రాహ్మనులను కించపరిచారంటూ టీవీ డిబేట్లలో పాల్గొని వాదించడంతో బాగా వైరల్ అయ్యారు. ఇక ఈ విషయాల పై మరోసారి అసలు ఎందుకు ఆ వాదనలోకి వెళ్ళవలసి వచ్చింది అనే విషయం చెప్పారు జొన్నవిత్తుల.

సినిమాలో ఆ డైలాగు విన్నాక కోపం వచ్చింది…

జొన్నవిత్తుల గారు మాట్లాడుతూ రచనలు ప్రింటింగ్ కి ఇవ్వగా అది ఇంకా ఆలస్యం అవడంతో ఆ సమయంలో ఏమి చేయాలి అని ఈ సినిమాలో ఏదో వివాదం జరుగుతోంది ఎందుకు అని ‘దేనికైనా రెడీ’ సినిమా చూడటానికి వెళ్ళాను అంటూ చెప్పారు. ఒక చోట సినిమాలో సన్నివేశం చండి యాగం చేయాలి అంటూ ఒక వేద పండితుడిని పిలవగా రాను అంటాడు, వెంటనే డబ్బులు ఎక్కువ పడేస్తే తోక ఊపు కుంటూ వాళ్ళే వస్తారు అనే డైలాగు వస్తుంది. అక్కడ బాగా కోపం వచ్చింది బ్రాహ్మణలను అన్నాడని కాదు ఒక వేద పండితుడిని అలా ఎలా కించపరిచగలిగారు అనిపించింది.

అది అయ్యాక ఒక పండితుడి ఇంటికి వెళ్లగా ఆయన ఉండరు ఆయన భార్య ఉంటుంది ఆమె తన భర్త నేపాల్ వెళ్ళాడు అని చెప్పి మీరు అచ్చం మా ఆయన లా ఉన్నారు అనడం, ఆమె లోపలికి వెళ్ళగానే ఈవిడ భర్తల ఉన్నానని నాతో తన భర్తతో చేసే పనులు చెయ్యదుగా అంటూ జోక్ చేయడం, ఎంత చెండాలంగా ఉంది. ప్రపంచంలో ఏ భార్య అయిన ఇంకొక వ్యక్తిని నా భర్తలా ఉన్నాడు అంటుందా?? అక్రమసంబంధం పెట్టుకోవాలని అనుకుంటే ఆమె భర్తలా ఉన్నవాడే ఎందుకు అక్కడ చాలా కోపం వచ్చింది. ఇక టీవీ ఛానెల్స్ వాళ్ళు పిలవడంతో డిబేట్ కి వెళ్ళాను అక్కడ నేను మాట్లాడినవాటికి నా తల పగులకొడతాం అంటూ అటువైపు వారు అన్నారు అంటూ చెప్పారు. ఇక కోర్ట్ లో పరువునష్టం దావా నా మీద వేసారు. ఐదేళ్ళు ఆ కేసు నడిచి తరువాత కోర్ట్ ఆ కేసును కొట్టేసారు. నేను మాట్లాడిన మాటలకు నాపై కేసు వేశారు. ఎంతోమంది పండితులు పిండాలు పెట్టారు శాపాలు పెట్టారు ఏమీ చేయలేక ఇక కోర్ట్ వద్ద ఒక మహిళ చెప్పు విసిరింది వాళ్ళ మీద అవన్నీ పరువు నష్టం కాదా అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

‘బీజేపీ అహంకారానికి ఈ మంటలే సమాధానం’.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…

46 minutes ago

పాస్ చేయండి సార్ అంటూ బోర్డుకు కాల్.. విశాఖలో విద్యార్థి వింత ఘటన

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…

55 minutes ago

కూతురి ప్రాణం తీశిన తండ్రి.. భువనగిరిలో దారుణం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…

1 hour ago

గురువారం పూజతో అదృష్టం మారుతుందా? కాశీలో అరుదైన బృహస్పతి ఆలయం.. గురు దోషాలకు ప్రత్యేక పరిష్కారం!

భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…

1 hour ago

రూ.10 కోట్ల స్కామ్ ఆరోపణలు.. మంగ్లీపై వివాదం మరింత ముదురు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…

2 hours ago

‘మహిళ గౌరవమే దేశ గౌరవం’.. బిల్లుల ముందు మోదీ ట్వీట్ వైరల్

పార్లమెంట్‌లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…

2 hours ago