Kantharao daughter Susila : తెలంగాణ మొదటి సూపర్ స్టార్ అంటే కత్తుల కాంతారావు గారే. ఎన్టీఆర్ తో పాటు ఆ కాలంలో పౌరాణిక సినిమాల్లో నటుడుగా రాణించిన ఆయన అటు పౌరాణిక జానపదాలతో పాటు సాంఘిక చిత్రాలలో కూడా అలరించారు. ఇక ఎన్నో సినిమాల్లో హీరోగానూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చేసిన ఆయన విలన్ గా కూడా ప్రయత్నించారు. ఇక ఆయన నటనకు ఎంతోమంది మంది అభిమానులు ఉన్నా ఆయన ఆస్తిత్వాన్ని నిలుపుకోవాలని వాళ్ళ పిల్లలు ఆరాట పడుతున్నారు. ఇక అంత పెద్ద హీరో అయినా సినిమాల్లో సంపాదించినదంతా అందులోనే పోగొట్టుకున్న ఆయన చివరగా సొంతిల్లు లేకుండా మరణించారు. ఇక ఆయన జీవిత విశేషాలను ఆయన కూతురు సుశీల తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పుట్టపర్తి సత్యసాయి బాబా అంటే అమితమైన భక్తి ఉన్న కాంతారావు గారు అసలు బాబాను ఎలా నమ్మారు అనే విషయాలను ఆవిడ తెలిపారు.
బాబా అంటే ఒకప్పుడు నమ్మేవారు కాదు…
కాంతారావు గారి కూతురు సుశీల మాట్లాడుతూ పుట్టపర్తి బాబాగారిని అసలు మొదట్లో నాన్న నమ్మేవారు కాదు, సీనియర్ నటి అంజలి దేవి గారు బాబాను చాలా నమ్మేవారు. ఆవిడ ఎన్నో సార్లు పుస్తకాలు ఇచ్చి ఆయన మహిమలను చదవండి అంటూ చెప్పినా నమ్మేవారు కాదు కానీ ఒకసారి బాబా మద్రాస్ వచ్చిన సమయంలో నాకు ఆరోగ్యం బాగోలేనపుడు ఆయన వద్దకు తీసుకెళ్తే ఆయన అప్పటికే ఆయన గదిలోకి వెళ్లి పోయారు ఎవరినీ కలవరు అని చెప్పారు. పాపకు చాలా బాగాలేదు పిలవండి అని అడిగితే విభూది పంపారు.
నీళ్లలో కలిపి పాపకు తాగించమని చెప్పడం రెండు రోజుల్లో నాకు బాగైపోయింది. ఇక అప్పటి నుండి నాన్న బాబాను నమ్మడం మొదలు పెట్టారు అంటూ చెప్పారు సుశీల. ఇక సుశీల గారి అన్న పెళ్లి, వాళ్ళ పిల్లలకు ఉడుగు అన్ని బాబా గారే చేసారు. ఇక నాన్న షష్ఠి పిర్తి కూడా ఆయనే జరిపించారు అందరూ చూస్తుండగా అమ్మకు పుస్తెలు ఇచ్చి నాన్నను కట్టమని నాన్నకు డైమండ్ రింగ్ ఇచ్చారు. ఆయన బెంగళూరు వచ్చినా నాన్న వెళ్లి దర్శనం చేసుకునేవారు. ఇక అంజలి దేవి, కాంచన, జమున వీళ్లందరు ఆయనకు భక్తులే అంటూ సుశీల చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…