Saipallavi: టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి పరిచయం అవసరం లేదు.ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన నటనతో డాన్స్ తో ఫిదా చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.
ఇలా తనకు అనుగుణంగా తనకు నచ్చిన పాత్రలను ఎంపిక చేసుకొని వరుస హిట్ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి గత కొంతకాలంగా ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇలా సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉండడానికి గల కారణాలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. ఈమె పెళ్లి చేసుకోబోతుందని అందుకే సినిమాలకు దూరంగా ఉంటుంది అంటూ వార్తలు వచ్చాయి
ఇకపోతే తాజాగా సాయి పల్లవి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నారని అయితే అందుకు గల కారణం కేవలం ఆమె వైద్యవృత్తిలో స్థిరపడటమే కారణమని తెలుస్తుంది. ఈమె ఇండస్ట్రీలోకి రాకముందే వైద్య విద్యను అభ్యసించిన సంగతి మనకు తెలిసిందే.గతంలో కూడా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తాను సినిమాలలో కొనసాగకపోతే వైద్య వృత్తిలో స్థిరపడతానని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఈ క్రమంలోనే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సాయి పల్లవి తన చెల్లెలితో కలిసి కోయంబత్తూర్ లో హాస్పిటల్ నిర్మాణం కోసం పలు కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ అనుమతి తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని,ప్రస్తుతం ఈమె హాస్పిటల్ నిర్మాణ పనులలో బిజీగా ఉండటం వల్లే సినిమాలకు దూరంగా ఉన్నారని భవిష్యత్తులో తాను పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి వైద్య వృత్తిలో కొనసాగుతుందని తెలుస్తోంది. సాయి పల్లవి సినిమాలకు దూరమవుతుందని తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…