Featured

Senior actor Jhansi : సావిత్రి గారు చనిపోయే ముందు డబ్బులు లేక జెమినీ గణేశన్ పేపర్ లో యాడ్ ఇచ్చారు… అది చూసి చాలా బాధపడ్డా…: సీనియర్ యాక్టర్ ఝాన్సీ

Senior actor Jhansi : ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించిన అలనాటి నటి ఝాన్సీ. బాపు గారి సినిమాల్లో ఎక్కువగా కనిపించిన ఝాన్సీ గారు తల్లి పాత్రలతో ఎక్కువగా మెప్పించారు. ఎక్కువగా ఎన్టీఆర్ గారితోనూ, ఏఎన్ఆర్ తోనూ అప్పటి అగ్ర హీరోలందరితోనూ ఎన్నో సినీమాల్లో నటించిన ఆమె ఈ తరం వారికి గుర్తు రావాలంటే మాత్రం మనవూరి పాండవులు, పెళ్లి పుస్తకం, శంకరాభరణం వంటి సినిమాల్లో నటించిన ఝాన్సీ గారిని చూడవచ్చు. ఎన్నో సినిమాల్లో నటించి ఆర్థికంగా బాగా సంపాదించుకున్నా నేడు ఒక చిన్నగదిలో కాలం వెళ్ళదీస్తున్నారు ఝాన్సీ. అప్పట్లో అగ్ర నటులతో పనిచేసిన ఝాన్సీ గారు అప్పటి అనుభవాలను పంచుకున్నారు.

సావిత్రి గారి విషయంలో బాధపడ్డాను…

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు ఇలా అందరు నటులతో పనిచేసిన ఝాన్సీ గారు చిన్నవయసులోనే తల్లి పాత్రలను వేశారు. సావిత్రి గారు, కే ఆర్ విజయ, భానుమతి వంటి వారితో పనిచేసిన ఆమె తాజా ఇంటర్వ్యూలో అప్పటి విషయాలను పంచుకున్నారు. ఎక్కువగా ఎవరితోనూ స్నేహం చేయని ఝాన్సీ గారు కేవలం సావిత్రి గారు, విజయ గారితో ఎక్కువగా మాట్లాడేదాన్ని అంటూ చెప్పారు. విజయ గారి ఇల్లు పక్కనే ఉండటం వల్ల తరచూ కలుసుకునేవాళ్ళమని చెప్పారు.

ఇక సావిత్రి గారి ఇంటికి వెళ్తూ అప్పుడప్పుడు కలిసేవాళ్ళమని, ఆవిడ దానధర్మలు ఎక్కువగా చేసేవారంటూ తెలిపారు. ఇక సావిత్రి గారికి ఆరోగ్యం బాగోలేక కోమాలో ఉన్నపుడు ఆవిడను చూడటానికి వెళ్లలేకపోయానని చెప్పారు ఝాన్సీ. ఆ సమయంలో సావిత్రి గారి భర్త జెమినీ గణేశన్ గారు వార్త పత్రికలో సావిత్రి గారి చికిత్స కోసం ఎవరైనా డబ్బు సహాయం చేయండంటూ ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన చూసి చాలా బాధపడ్డాను, ఎలా బ్రతికిన ఆమె ఎలా అయ్యారు చివరికి అనుకుని ఆమె జీవితం అందరికీ ఒక గుణపాఠం అంటూ ఝాన్సీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago