సీనియర్ నటి ఖుష్బూ గుర్తుందా మీకు.? అదేనండి.. “కలియుగ పాండవులు” చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన నాటి అందాల తార ఖుష్బూ సుందర్ కోసం పరిచయం అవసరం లేదనుకుంటాను.
ఈమధ్యనే మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో జరిగిన క్లాష్ ఆఫ్ ఎయిటీస్ పార్టీలో స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన ఖుష్బూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఒకప్పటికి ఖుష్బూ లుక్ వేరు.. ఆ తర్వాత ఇప్పటి లుక్ వేరు. ఆమెలో ఎవరూ ఊహించనంత మార్పు కనిపించింది. నవతరం హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత గ్లామర్ గా బొద్దగా వుండే ఈ ముద్దుగుమ్మ కాస్త బుట్టబొమ్మలా మారిపోయింది. ఇంతకీ ఇంత తక్కువకాలంలో అంతలాగ ఖుష్బూ గ్లామర్ లో మార్పు ఎలా సాధ్యమైంది? అన్న విషయాన్ని ఎంక్వయిరీ చేస్తే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సహజంగానే బొద్దుగా ఉండే సెలబ్రిటీలకు సోషల్ మీడియాల్లో ట్రోల్స్ ఎదురవుతుంటాయి.
అదేవిధంగా గతంలో ఖుష్బూ కుమార్తె ఆనందిత ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే తన కుమార్తెపై కామెంట్లు చేసిన నెటిజనులకు ఖుష్బూ అంతే ధీటుగా కౌంటర్లు వేశారు. ఇక ఖుష్బూ కి అవంతిక – ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ట్రోలింగ్ తో బాగా ఫీలైన ఆనందిత ఎంతో పట్టుదలగా తన రూపం మార్చుకునేందుకు శ్రమించింది. ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోలలో ఆనందిత రూపంలో ఎవరూ ఊహించని మార్పు కనిపించింది. సో.. ఆనందిత నెట్ లో తనపై వచ్చిన ట్రోల్స్ కు చెక్ పెట్టినట్లేనని గ్రహించిన ఖుష్బూ కూడా తన కూతురినే ప్రేరణగా తీసుకుని ఈ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారని తాజాగా ఆమె గ్లామర్ లుక్ ను చూస్తే అర్థమవుతోంది.
మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం, జిమ్ ఎంతవరకూ అవసరమో ఖుష్బూ చాలా సందర్భాల్లో తెలిపారు. ఎంతో క్రమశిక్షణ, పట్టుదలతో అనుకున్నది సాధించారు. ఎయిటీస్ స్టార్స్ అంతా షాక్ తినే రేంజులోనే ఈ ఛేంజోవర్ సాధ్యమైంది. మరి ఖుష్బూ స్ఫూర్తితో మీరూ కూడా మీ గ్లామర్ డోసును పెంచుకోవడానికి ఈ లాక్ డౌన్ సమయమే కరెక్ట్ టైం. మీరి మీరూ ట్రై చేయండి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…