బొద్దుగుమ్మ కాస్త బుట్టబొమ్మలాగ మారిందెట్లా చెప్మా.?! (సీనియర్ నటి ఖుష్బూ గ్లామర్ సీక్రెట్స్)

0
393

సీనియర్ నటి ఖుష్బూ గుర్తుందా మీకు.? అదేనండి.. “కలియుగ పాండవులు” చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన నాటి అందాల తార ఖుష్బూ సుందర్ కోసం పరిచయం అవసరం లేదనుకుంటాను.

ఈమధ్యనే మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో జరిగిన క్లాష్ ఆఫ్ ఎయిటీస్ పార్టీలో స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన ఖుష్బూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఒకప్పటికి ఖుష్బూ లుక్ వేరు..  ఆ తర్వాత ఇప్పటి లుక్ వేరు. ఆమెలో ఎవరూ ఊహించనంత మార్పు కనిపించింది. నవతరం హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత గ్లామర్ గా బొద్దగా వుండే ఈ ముద్దుగుమ్మ కాస్త బుట్టబొమ్మలా మారిపోయింది. ఇంతకీ ఇంత తక్కువకాలంలో అంతలాగ ఖుష్బూ గ్లామర్ లో మార్పు ఎలా సాధ్యమైంది? అన్న విషయాన్ని ఎంక్వయిరీ చేస్తే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సహజంగానే బొద్దుగా ఉండే సెలబ్రిటీలకు సోషల్ మీడియాల్లో ట్రోల్స్ ఎదురవుతుంటాయి.

అదేవిధంగా గతంలో ఖుష్బూ కుమార్తె ఆనందిత ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే తన కుమార్తెపై కామెంట్లు చేసిన నెటిజనులకు ఖుష్బూ అంతే ధీటుగా కౌంటర్లు వేశారు. ఇక ఖుష్బూ కి అవంతిక – ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ట్రోలింగ్ తో బాగా ఫీలైన ఆనందిత ఎంతో పట్టుదలగా తన రూపం మార్చుకునేందుకు శ్రమించింది. ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోలలో ఆనందిత రూపంలో ఎవరూ ఊహించని మార్పు కనిపించింది. సో.. ఆనందిత నెట్ లో తనపై వచ్చిన ట్రోల్స్ కు చెక్ పెట్టినట్లేనని గ్రహించిన ఖుష్బూ కూడా తన కూతురినే ప్రేరణగా తీసుకుని ఈ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారని తాజాగా ఆమె గ్లామర్ లుక్ ను చూస్తే అర్థమవుతోంది.

మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం, జిమ్ ఎంతవరకూ అవసరమో ఖుష్బూ చాలా సందర్భాల్లో తెలిపారు. ఎంతో క్రమశిక్షణ, పట్టుదలతో అనుకున్నది సాధించారు. ఎయిటీస్ స్టార్స్ అంతా షాక్ తినే రేంజులోనే ఈ ఛేంజోవర్ సాధ్యమైంది. మరి ఖుష్బూ స్ఫూర్తితో మీరూ కూడా మీ గ్లామర్ డోసును పెంచుకోవడానికి ఈ లాక్ డౌన్ సమయమే కరెక్ట్ టైం. మీరి మీరూ ట్రై చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here