Senior Actor Murali Mohan : ఆ ఒక్క సినిమా వల్ల జీవితంలో సంపాదించినదంతా నష్టపోయాను…: సీనియర్ నటుడు మురళీ మోహన్

Senior Actor Murali Mohan : వ్యాపారం నుండి సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన మురళీ మోహన్ గారు ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఎన్నో సినిమాల్లో నటించారు. జగమే మాయ సినిమాతో అడుగుపెట్టిన ఆయన అనతి కాలంలోనే ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు స్టార్ డమ్ తెచ్చుకున్నారు. మా అసోసియేషన్ కి అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయన అటు సినిమా రంగంలోనే కాకుండా ఇటు పాలిటిక్స్ లోకి వచ్చి తనదైన ముద్ర వేశారు. ఎంపీ గా ఎన్నో సేవా కార్యక్రమాలను చేసారు. ఇక మరో వైపు వ్యాపారవేత్తగా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ఇవన్నీ కాకుండా ఏంతో మంది పేద పిల్లలను చదివిస్తున్న మురళీ మోహన్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన జీవిత విశేషాలను తెలిపారు.

ఆ సినిమాతో బాగా నష్టపోయాను…

సినిమాల్లో సంపాదించినదంతా మళ్ళీ సినిమా నిర్మాణంలోకి పెడుతూ అలానే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రిబ్యూషన్ లో కూడా అడుగుపెట్టారు మురళీ మోహన్. ఇది కాకుండా జయభేరి చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా సినిమాలను నిర్మించారు మురళీ మోహన్ గారు. అయితే శోభన్ బాబు గారు వ్యాపారంలో మంచి అనేది ఉండదు డిస్ట్రిబ్యూషన్ లో వాళ్ళు లాభాలు తీసుకుని నీకు యిస్తారు. అది కూడా నీకు ఇవ్వచ్చు లేదా నష్టాలు చూపించవచ్చు, ఇక సినిమా నిర్మాణంలోనూ లాభాలు ప్రతిసారి రావు భూమి మీద పెట్టుబడి పెట్టు అని సలహా ఇచ్చారట.

ఆయన చెప్పిన కొన్నిరోజులకే రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు మూతపడ్డాయి. అదే సమయంలో తమిళ సినిమా ‘ఇరువర్’ హక్కులు కొని తెలుగులో ‘ఇద్దరు’ గా విడుదల చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అవడంతో జీవితంలో సంపాదించినదంతా ఒక్కసారిగా పోగొట్టుకున్నారట. నష్టాలను చూసినపుడు శోభన్ బాబు గారు చెప్పింది నిజమని అర్థమై అపుడు ఉన్న కొంత డబ్బుతో హైదరాబాద్ భూమి కొని రియల్ ఎస్టేట్ వైపు వచ్చాను అంటూ మురళీ మోహన్ తెలిపారు.