Senior Actor Naresh: ఇండస్ట్రీకి, మాకి పెద్దన్న ఆయనే… నరేష్ కామెంట్స్ వైరల్!
Senior Actor Naresh: దివంగత దాసరి నారాయణరావు మరణించిన తరువాత సినీ పెద్ద ఎవరు అనే విషయం గురించి ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ విషయం మా ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సినిమా ఇండస్ట్రీకి మోహన్ బాబు పెద్దగా వ్యవహరిస్తే బాగుంటుందని కొందరు వారి అభిప్రాయాలు వ్యక్తం చేయగా మరికొందరు ఇండస్ట్రీ పెద్ద మెగాస్టార్ అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
ఈ క్రమంలోనే మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్న సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ… ఇండస్ట్రీకి మా అందరికీ పెద్ద మోహన్ బాబు గారే అంటూ ఆయన గురించి మాట్లాడారు.
తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్న, మా అందరికీ అన్న, అందరి కంటే మిన్న మోహన్ బాబు గారు. ఇండస్ట్రీలో ఎంతో మంది గొప్ప హీరోలు, గొప్ప విలన్లు ఉన్నారు. అలాగే గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు వీరందరూ కలిస్తేనే మోహన్ బాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించి నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా విద్యాసంస్థలను నెలకొల్పి ఆ విద్య సంస్థలను యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మోహన్ బాబు అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఆయన సినిమా కోసం బతికే వ్యక్తి కాదని….సినిమా కోసమే ఆయన పుట్టిన వ్యక్తి అంటూ నరేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…