Senior actor Pradeep : జంధ్యాల గారి దర్శకత్వంలో ముద్దమందారం సినిమాతో హీరోగా పరిచయమైన ప్రదీప్, ఆ తరువాత ఎన్నో సినిమాల్లో సహ నటుడుగా పనిచేసారు. ఇక పలు సీరియల్లో నటించిన ప్రదీప్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలను నిర్వహిస్తూ యాంకర్ గా ఎదగాలనుకునే వారికి సహాయంగా వర్క్ షాప్స్ నిర్వహిస్తుంటారు. ఇటీవలే ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఆయన యూట్యూబ్ లో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆయన సినిమా ప్రయాణం గురించి చెబుతూనే పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు.
వెంకటేష్ ఆటిట్యూడ్ చాలా బావుంటుంది…
హీరోగా నటించి ఒక కమెడియన్ పాత్రలో నేను నటించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రదీప్ గారు ఎఫ్2 సినిమా కోసం అనిల్ రావిపూడి అడిగినపుడు అన్నుకున్నారట. అయితే సినిమాలో ఎవరైనా కమెడియన్ ను పెట్టుకోవచ్చు కానీ మీరైతే ప్రేక్షకులు కొత్తగా ఫీల్ అవుతారు అని చెప్పి కన్విన్స్ చేసాడట డైరెక్టర్. ఇక ఎఫ్2 సెట్ లో వెంకటేష్ తో వర్క్ చేస్తున్నపుడు ఆయన ఎంత సింపుల్ గా ఉంటారో చూసి ఆశ్చర్యమేసింది అంటూ చెప్పారు.
ఆయన అంత పెద్ద నటుడు అయినా కూడా చాలా సాధారణంగా ఉంటారు మాట్లాడుతారు. నాది ఆయనది ఒక ఏజ్ గ్రూప్ అవడం వల్ల మేము ఇంకాస్త ఎక్కువగా కలిసిపోయాము. ఆయన అధ్యాత్మిక విషయాలను బాగా చెప్తారు. అందులో చాలా విషయాలు ఆయనకు తెలుసు. ఇక ఆయన ఎపుడైనా డైలాగ్ మర్చిపోతే గిబ్బరీష్ భాష మాట్లాడుతారు అపుడు అందరికీ సెట్స్ లో నవ్వొస్తుంది అంటూ చెప్పారు ప్రదీప్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…