Categories: FeaturedMovie News

టాలీవుడ్ లోని క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై సీనియర్ నటి ప్రగతి సంచలన కామెంట్స్ !!

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో సీనియర్ నటి ప్రగతికి మంచి గుర్తింపు ఉంది. తనకంటూ ఓ ఇమేజ్ ను సృష్టించుకుని దాదాపు స్టార్ హీరోలందరికీ అమ్మగానో, అత్తగానో నటించిన ప్రగతి, వెండి తెరపై చాలా పద్ధతిగా, కామెడీగా మంచి మంచి పాత్రలు వేస్తుంది.

గత కొన్ని రోజులుగా కరోనా లాక్ డౌన్ వచ్చిన దగ్గరి నుంచి ప్రగతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తను చేసే డ్యాన్సులు, యోగా వర్కవుట్ లతో పాటు గ్లామర్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రెగ్యులర్ గా తన ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటుంది. ఈమధ్య ప్రగతి చేసిన మాస్ స్టెప్పులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. వెండి తెరపై తల్లి, అత్త పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రగతిని ఇలా మరీ ఇంత మోడ్రన్ గా, యంగ్ గా కనబడటంతో నెటిజన్లు షాకవుతున్నారు. హీరోయిన్ల కంటే మంచి ఫిట్ నెస్ తో గ్లామర్ గా ఉందని ఆమె ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇదిలావుండగా లేటెస్ట్ గా ప్రగతి ఓ యూ ట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో టాలీవుడ్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ తన వ్యక్తిగత జీవితం సినీ కెరీర్ గురించి ఇలా అన్ని అంశాలపై మాట్లాడింది. ఈ క్రమంలో సినిమా రంగంలోని క్యాస్టింగ్ కౌచ్ వంటి వ్యవహారం పైన సంచలన కామెంట్స్ చేసింది.

క్యాస్టింగ్ కౌచ్ గురించి నటి ప్రగతి మాట్లాడుతూ “పెద్ద హీరోయిన్లు, ఓ స్థాయికి వెళ్లిన హీరోయిన్లు ఎవ్వరూ కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉన్నా, లేకపోయాయినా లేదనే చెబుతారు. తమకలాంటివి ఎదురు కాలేదనే చెబుతారు. ఎవరైతే సక్సెస్ కాలేదో వాళ్ళ దగ్గర్నుంచే ఎక్కువగా కంప్లైంట్స్ వస్తాయని, కానీ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఆ రెండూ కేసుల్లో ఉండొచ్చు, ఉండక పోవచ్చని, ప్రస్తుతం కేవలం అమ్మాయిల కోసమే సినిమాలు తీసే పరిస్థితులు లేవని, మనం కాకపోతే ఎంతోమంది నటించేందుకు రెడీగా ఉన్నారని, అమ్మాయిలని నమ్ముకుని కోట్లు పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రారని, ఎక్కడైనా సరే అమ్మాయి అందంగా ఉంటే క్యాస్టింగ్ కౌచ్ లాంటి వ్యవహారాలు అవ్వడానికి ఛాన్స్ ఉందని, కాస్టింగ్ కౌచ్ లాంటి సందర్భాలు ఎదురైతే ఎలా రియాక్ట్ అవ్వాలనేది మనపైనే ఆధారపడి ఉంటుందని, వ్యక్తిగతంగా తనకూ ఇలాంటి సంఘటనలు ఎదురైతే అక్కడి నుంచి వెళ్లి పోవడమో.. లేదా ఆ సినిమా నుంచి తప్పుకోవడం లాంటివి చేస్తానని, అంతే కాని ఎవరి మీదనో కంప్లైంట్ చేయడం కరెక్ట్ కాదని, అయినా ఏ ఒక్కరో అలా చేశారని సినీరంగంలోని తారలందరినీ అలా అనడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేసింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

5 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

5 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

5 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

5 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

5 months ago