Categories: FeaturedMovie News

ఇళయరాజా అరాచకాలు అన్ని తెలుసు…టాలీవుడ్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ సంచలన కామెంట్స్ !!

ఇళయరాజా.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు వుండరు. సినిమా ప్రేమికులు వుండరు. సినీ సంగీతానికి కొత్త వన్నె తీసుకొచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని. చిత్రపరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగీత దర్శకుడు ఇళయరాజా-ప్రసాద్ ల స్టూడియో వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

ఎల్‌వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్‌ పై ఇళయ రాజా తాజాగా పోలీసు కేసు నమోదు చేశారు. సాయి, అతని మనుషులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, తన స్టూడియోను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రసాద్ స్టూడియోలోని తన సూట్‌ లోకి ప్రవేశించి మరీ సంగీత వాయిద్యాలు, నోట్లు, ఇతర పరికరాలను ధ్వంసం చేశారని, తన విలువైన వస్తువులను అధిక మొత్తానికి విక్రయించుకున్నారని చెన్నై కమిషనర్‌కు కంప్లైంట్ ఇచ్చారు ఇళయరాజా. సాయి, అతని అనుచరులపై శాశ్వత ఆంక్షలు విధించాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినట్లు ఈ సందర్భంగా ఇళయరాజా వివరించారు. ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే తనపై దౌర్జన్యం చేసి, బలవంతంగా స్టూడియోను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని, స్టూడియోలో తన కార్యక్రమాలకు అడ్డొస్తున్నారని ఈ నేపథ్యంలో సాయి ప్రసాద్, అతని అనుచరులపై క్రిమినల్. చర్యలు తీసుకోవాలని ఇళయరాజా డిమాండ్‌ చేశారు. ఇదిలా వుండగా. చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్ స్థాపకుడు ఎల్‌వీ ప్రసాద్, ఇళయ రాజాపై గౌరవంతో ప్రత్యేక గది ఉన్న స్టూడియో స్థలాన్ని 
బహుమతిగా ఇచ్చారు. 

ఇక్కడున్న రికార్డింగ్ స్టూడియోలోనే గత 40 సంవత్సరాలకు పైగా ఆయన తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఎల్‌వీ ప్రసాద్‌ కుమారుడు రమేష్‌ ప్రసాద్‌ ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పకపోగా, మనవడు సాయి ప్రసాద్ మాత్రం స్టూడియోను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వివాదం ప్రస్తుతం నడుస్తుంది. ఇదే అంశంపై తాజాగా ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ స్పందించి సంగీత దర్శకుడు ఇళయరాజా అరాచకాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయని సంచలన కామెంట్స్ చేయడం విశేషం. వివరాల్లోకి వెళ్తే..

ఓ చిత్రానికి పాట కంపోజ్ చేసినపుడు ఆ పాటకు సంబంధించిన కాపీరైట్స్ ప్రతీ రూపాయి ఖర్చు పెట్టిన నిర్మాతకే ఉంటాయని చెప్తున్నాడు ప్రసాద్. కానీ ఇళయరాజా మాత్రం అలా కాకుండా తన పాటలు బయట ఎవరు పాడినా వాళ్ళపై కేసులు పెడతానని.. తను కంపోజ్ చేసిన పాటల కాపీ రైట్స్ తనకే సొంతమని చెప్పడం కరెక్ట్ కాదని, గతంలో కూడా ఇలాగే ఎస్పీ బాలుపై కేసు వేసి అభాసుపాలయ్యాడని, ఆ తర్వాత ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యారని, ఇళయ రాజాకు మంచి క్రేజ్ ఉన్న రోజుల్లో నిర్మాతలను భయపెట్టి ఆడియో రైట్స్ కూడా రాయించుకున్నాడని తన సొంత ఆడియో కంపెనీని ఓపెన్ చేసి ఇప్పుడు లాభాలు పొందుతున్నాడని, అయితే చెన్నై ప్రసాద్ స్టూడియోస్‌ లో ఉన్న రికార్డింగ్ థియేటర్ తనదే అని ఇళయరాజా చెప్పడం మాత్రం అన్యాయం అని, ఓ సీనియర్ నిర్మాతగా.. ఇళయరాజాకు సంబంధించిన అన్ని విషయాలు తనకు తెలుసు కాబట్టే తాను మాట్లాడుతున్నానని.. అప్పట్లో ఇళయ రాజాయే స్వయంగా వెళ్లి ఎల్వీ ప్రసాద్‌ ను అడిగితే ఆయనే ఓ రికార్డింగ్ థియేటర్ కట్టించి ఇచ్చాడని కాబట్టి ఆ ధియేటర్ పై ఇళయ రాజాకు ఎలాంటి హక్కులు లేవని.. అది ఎన్ని రోజులు వాడుకుంటే దాని రెంట్ నిర్మాతలు కట్టేవాళ్లని, అది ఇళయరాజా సొంత ఆస్తి అని ఏ రోజు ఎల్వీ ప్రసాద్ చెప్పలేదని, ఇప్పుడు ఇళయరాజా గతాన్ని మరిచిపోయి ఆ రికార్డింగ్ థియేటర్ తనదే అని చెప్పడం భావ్యం కాదని.. ఎల్వీ ప్రసాద్ మనవడిపైనే కేసు పెట్టడం సరైన పద్ధతి కాదని, ఇళయారాజా అరాచకాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయని, అనవసరపు రాద్ధాంతం చేయకుండా కేసు వెనక్కి తీసుకుంటే ఆయనకు మర్యాదగా ఉంటుందని తెలియజేశాడు కాట్రగడ్డ ప్రసాద్.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago