బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ బలవాన్మరణం పొందటానికి బాలీవుడ్ నటి రియా చక్రవర్తియే కారణమంటూ సుశాంత్ తండ్రి తాజాగా కేసు పెట్టిన సంగతి తెలిసిందే. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మ బీహార్ పోలీసులు నటి రియా చక్రవర్తితో సహా మొత్తం 6 మంది బాలీవుడ్ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. వాటిలో ఐపీసీ సెక్షన్ 306 కూడా ఒకటి.
ఏ వ్యక్తినైనా బలవాన్మరణం చేసుకునే విధంగా ప్రేరేపిస్తే అందుకు కారణమైన నిందితులు చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. అలాగే తగినంత మొత్తం జరిమానా కూడా చెల్లించాల్సి వుంటుంది. సుశాంత్ మరణానికి నటి రియా చక్రవర్తే ప్రధాన కారణమని సోషల్ మీడియాలో సుశాంత్ ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టిగా, సుశాంత్ తండ్రి కూడా ఇదే విషయం నిజమని కేసు పెట్టారు. నటి రియా చక్రవర్తి హీరో సుశాంత్ క్రెడిట్ కార్డులను యూరప్ లో విచ్చలవిడిగా వాడుకుందని, అతని బాడీ గార్డుల్లో ఒకరిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తొలగించిందని, ఆమెకు సుశాంత్ కంపెనీలో వాటాలు కూడా ఉన్నట్లు తాజా దర్యాప్తులో తేలింది. జూన్ 14న సుశాంత్ ముంబైలోని తనింట్లోనే ఉరి వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో ఇప్పటికే పోలీసులు సుమారుగా 40 మందిని విచారించి స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకున్నారు. వారిలో ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్, దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలి, ఫిలిం మేకర్ ఆదిత్య చోప్రా వంటి బాలీవుడ్ ప్రముఖులున్నారు. లేటెస్ట్ గా పాట్నా పోలీసులు సుశాంత్ కుక్ నీరజ్ సింగ్, సహాయకుడు కేశవ్ బచ్‌నెర్, మేనేజర్ దీపేష్ సావంత్, క్రియేటివ్ మేనేజర్ సిద్ధార్థ్ రామ్‌నాథ్ మూర్తి పితాని, సోదరిలు నీతు, మీతు సింగ్‌లను కూడా విచారించారు. ఈ దర్యాప్తులో కేసు రోజుకో క్రొత్త మలుపు తిరుగుతోంది. సుశాంత్ మరణం వెనుక రాజకీయ, సినీ ప్రముఖుల హస్తం ఉన్నట్టు రూమర్స్ వినబడుతున్నాయి.
తాజాగా మీడియాతో మాట్లాడిన సుశాంత్ కుక్ నీరజ్ సింగ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాకి తెలియజేశారు. జూన్ 14 ఉదయం సుశాంత్ తన రూమ్ నుంచి బయటకు వచ్చి కూలింగ్ వాటర్ అడిగారు. అప్పుడు ఆయన కొంచెం టెన్షన్ గా, అనారోగ్యంగా కనిపించారు. అంతకన్నా ముందు రోజు రాత్రి సుశాంత్ డిన్నర్ చేయలేదు. 14 ఉదయం టిఫిన్ గురించి సుశాంత్ ను కేశవ్ అడిగాడు.కొబ్బరి నీళ్లు, ఓ అరటి పండు, జ్యూస్మాత్రం తీసుకురమ్మన్నారు. మరి, లంచ్‌కు ఏం చేయాలని అడిగితే.. రిప్లై ఇవ్వలేదు అని నీరజ్ తెలియజేశాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…