Featured

Senior Actor Varalakshmi : అన్నపుర్ణమ్మ గారు నాకు పిన్ని అవుతారు… ఎవరికీ ఈ విషయం తెలియదు… ఆమెతో మాట్లాడాలంటే భయం…: సీనియర్ నటి వరలక్ష్మి

Senior Actor Varalakshmi : నాగేశ్వరావు గారి సినిమా ‘అందాలరాముడు’తో ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి బేబీ వరలక్ష్మి గా ఫేమస్ అయిన నటి వరలక్ష్మి. హీరోలకు చెల్లిగా కూడా ఎక్కువ సినిమాలలో నటించారు. ఎక్కువగా కృష్ణ గారికి చెల్లిగా నటించి నిజంగానే ఆయన చెల్లి అనేలా ఒదిగిపోయి నటించారు. ఇక ఆ తరువాత తరం అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలకు చెల్లిగా నటించిన వరలక్ష్మిగారు పెళ్లి అయ్యాక పాప పుట్టిన తరువాత సినిమాలను తగ్గించి సీరియల్స్ ను చేస్తూ తెలుగు ఇండస్ట్రీకి కొంత దూరమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వరలక్ష్మి గారు తన సినిమా అనుభవాలను పంచుకున్నారు.

అన్నపూర్ణమ్మ నాకు బంధువు…

వరలక్ష్మి గారు ఇండస్ట్రీలో చిన్నప్పటి నుండి ఉన్నా తన ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. వరలక్ష్మి గారికి ఒక అక్క ఇద్దరు చెల్లెల్లు ఉండగా చెల్లెల్లు రాణి, సరస్వతి కూడా సినిమాల్లోను ముఖ్యంగా సీరియల్స్ లో బాగా గుర్తింవు తెచ్చుకున్నారు. ఇక వరలక్ష్మి గారి అక్క భర్త స్వయానా అన్నపూర్ణమ్మ గారి తమ్ముడు అవ్వడం వల్ల వరలక్ష్మి గారికి అన్నపూర్ణమ్మ గారు పిన్ని అవుతారు.

ఈ విషయం చాలా మందికి తెలియదు. వారి పెళ్ళికి ముందే వరలక్మి గారి తల్లికి అన్నపూర్ణమ్మకు మంచి అనుబంధం ఉండేదట. అయితే చాలా సినిమాల్లో కలిసి నటించినా, బంధువే అయినా మాట్లాడాలంటే భయమంటూ వరలక్ష్మి గారు తెలిపారు. అన్నపూర్ణమ్మ గారు చాలా సరదాగా మాట్లాడినా తనకు మాత్రం బాగా భయం అంటూ తెలిపారు. అయితే ఆవిడ కుటుంబం కోసం చాలా చేసారని తమ్ముడంటే చాలా ఇష్టమంటూ చెప్పారు. వారికోసం ఏదైనా చేస్తారంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago